twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సైలెన్స్’ అప్డేట్ : అనుష్క, అంజలి మ్యాటర్ లీక్!

    |

    సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క 'భాగమతి' తర్వాత దాదాపు సంవత్సరం గ్యాప్ తీసుకున్నారు. ఈ సమయం మొత్తం ఆమె తన ఫిజిక్ తగ్గించుకుని స్లిమ్ లుక్‌లోకి మారడం కోసమే కేటాయించారు. ఇటీవల విడుదలైన అనుష్క న్యూ లుక్ ఫోటోలు అభిమానులను సైతం ఆశ్చర్యపరిచాయి.

    అనుష్క ఈ స్లిమ్ లుక్‌లోకి మారింది తన తర్వాతి సినిమా కోసమే. 'సైలెంట్' పేరుతో రూపొందుతున్న ఈ మూవీ ద్వారా హేమంత్ మధుకర్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇందులో అనుష్కతో పాటు మాధవన్, అంజలి, సుబ్బరాజు, శాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

    అనుష్క, అంజలి మ్యాటర్ లీక్.. వారి పాత్రలు ఇవే!

    అనుష్క, అంజలి మ్యాటర్ లీక్.. వారి పాత్రలు ఇవే!

    తాజాగా ‘సైలెంట్' మూవీకి సంబంధించిన కొన్ని విషయాలు లీక్ అయ్యాయి. ఇందులో అనుష్క ఎన్ఆర్ఐ లేడీ పాత్రలో కనిపించబోతున్నారట. అంజలి ఇన్వెస్టిగేటింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని టాక్.

    యూఎస్ఏలో షూటింగ్

    యూఎస్ఏలో షూటింగ్

    ‘సైలెంట్' మూవీకి సంబంధించిన షూటింగ్ యూఎస్ఏలో మార్చి నుంచి ప్రారంభించేలా ప్లాన్ చేసినట్లు సమాచారం. త్వరలోనే సినిమాను సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

    కోన వెంకట్ నిర్మాణంలో

    కోన వెంకట్ నిర్మాణంలో

    కోన వెంకట్, టిజి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించబోతున్నారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. సినిమా ప్రారంభోత్సవం ఎప్పుడనేది త్వరలో అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.

    ఆ ఫోటోలపై రకరకాల ప్రచారం

    ఆ ఫోటోలపై రకరకాల ప్రచారం

    సినిమా కోసం స్లిమ్ లుక్‌లోకి మారిన అనుష్క కొత్త ఫోటోలు విడుదల చేసింది. అయితే అందులో అనుష్క పక్కనే ఒక కొత్త వ్యక్తి, ఎవరికీ పరిచయం లేని లుకె కౌంటినో అనే విదేశీయుడు ఉండటంతో... అతడు అనుష్క బాయ్ ఫ్రెండ్ అనే రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. లుకె కౌంటినో అవార్డ్ విన్నింగ్ న్యూట్రీషియనిస్ట్. అనుష్క బరువు తగ్గడానికి అతడి వద్దే ట్రైనింగ్ తీసుకుంది.

    English summary
    Film nagar source said that Anushka will be seen as an NRI lady and Anjali will be portraying an investigative police officer role in upcoming film Titled Silence.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X