Renu Desai : ఓవరాక్షన్ వద్దు.. పిల్లలకు ఇదేనా నేర్పేది , కడిగిపారేసిన రేణు దేశాయ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి రేణూ దేశాయ్ తన సినిమాలతో పాటు వర్తమాన ప్రపంచంలో జరుగుతున్న అంశాలపై తరచుగా స్పందిస్తూ ఉంటారు. ఏ సబ్జెక్ట్‌పై అయినా ఆమె అనర్గళంగా మాట్లాడగలరు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ఎంతో ఇష్టపడే రేణు.. తాజాగా ఈ విషయంపై తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. ఈ వివరాల్లోకి వెళితే..

పవన్‌ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత పిల్లలే ప్రపంచంగా బతుకుతున్నారు రేణు దేశాయ్. అలాగే పర్యావరణ కార్యకర్తగా, జంతు ప్రేమికురాలిగా సేవలందిస్తున్నారు. తనకు తోచినంత సాయం చేయడంతో పాటు , ప్రజలు కూడా మారేలా అవగాహన కల్పిస్తుంటారు రేణు. మూగజీవాలకు ఏ కష్టం కలిగినా ఆమె చలించిపోతారు. ఇటీవల విజయవాడలో సంభవించిన వరదల్లో చిక్కుకున్న పెట్స్‌ను కాపాడాలని స్వయంగా తన మాజీ భర్త పవన్ కళ్యాణ్‌ను కోరారు. ఓ వ్యక్తి కుక్కను చిత్రహింసలు పెడుతుండటంతో ఆ వివరాలను షేర్ చేసి ఇలాంటి తప్పులు చేస్తే అరెస్ట్ అవుతారని హెచ్చరించారు.

AP Deputy CM Pawan Kalyan Ex Wife Renu Desai perform ganapathi chandi homam at her residence

మనుషులు స్వార్ధంగా మారుతున్నారని.. వారి చుట్టూ ఉన్న ప్రతిదానిని నాశనం చేస్తున్నారని, కేవలం డబ్బు సంపాదించడం ఒక్కటే విజయానికి కొలమానం కాదంటూ రేణూ దేశాయ్ విరుచుకుపడ్డారు. హిందూ మతాన్ని అనుసరించే రేణు.. భారతదేశంలో సెక్యులరిజం వంటి కాంట్రవర్సియల్ సబ్జెక్ట్‌పై ధైర్యంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. దేశంలోని చర్చిలు, మసీదులు ప్రభుత్వ ఆధీనంలో ఉండవని, కేవలం హిందూ ఆలయాలు మాత్రమే గవర్నమెంట్ అండర్‌లో ఉంటాయని అలాంటప్పుడు ఇండియా సెక్యులర్ దేశం ఎలా అవుతుందని రేణు ఓ సందర్భంలో ప్రశ్నించారు.

గత నెలలో దేశవ్యాప్తంగా ఘనంగా జరిగిన వినాయక చవితి వేడుకల్లో భక్తులు అనుసరిస్తున్న పద్ధతులపై ఘాటు విమర్శలు చేశారు రేణు దేశాయ్. హీరో హీరోయిన్ల గెటప్స్‌లో వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసి.. మంటపాలలో ఐటెం సాంగ్స్ ప్లే చేస్తున్నారని ఆమె భగ్గుమన్నారు. ఎవరు పెద్ద వినాయకుడిని పెడితే వారే గొప్ప అన్నట్లుగా పండుగ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజానికి అందులో దేవుడు లేడని మనిషి దురాశ, అత్యాశ మాత్రమే కనిపిస్తున్నాయన్నారు.

ప్రతి మాసంలోనూ వచ్చే పండుగలు, విశిష్ట దినాలను ఘనంగా జరుపుకుంటారు రేణు దేశాయ్ . తాజాగ్ శరద్ పౌర్ణమి సందర్భంగా ఆమె తన నివాసంలో గణపతి చండీ హోమం నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అక్కడితో వదిలేస్తే ఏముంది.. పనిలో పనిగా పేరెంట్స్‌, సమాజానికి క్లాస్ తీసుకున్నారు రేణు దేశాయ్. భారతీయ సంస్కృతిలో శరద్ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉందని.. పెద్దలు అనుసరించిన విధానాలను పిల్లకు నేర్పించాలని ఆమె కోరారు.

పూజలు, ఇతర క్రతువులు నిర్వహించేటప్పుడు హంగులు , ఆర్భాటాల జోలికి పోవద్దని, భగవంతుడిపైనే మనసు పెట్టాలని రేణు దేశాయ్ సూచించారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే ఈ చండీ హోమంలో తల్లితో పాటు అకీరా నందన్ కూడా పాల్గొన్నారు. ఏపీ ఎన్నికలకు ముందు రేణు దేశాయ్ మాజీ భర్త పవన్ కళ్యాణ్ కూడా జనసేన కార్యాలయంలో హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X