పవన్ నివాసానికి దగ్గరలో రేణూ దేశాయ్ .. నన్ను లాగొద్దంటూ షాకింగ్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రస్తుతం మహిళా హక్కులు, పర్యావరణం, జంతు ప్రేమికురాలిగా సామాజిక సేవకు అంకితమయ్యారు. ఓ వైపు పిల్లలను చూసుకుంటూనే ఎన్జీవో కార్యక్రమాల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తాజాగా ఆమె చేసిన కామెంట్స్, సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది.
తన సినిమాలు, సోషల్ సర్వీస్‌తో పాటు సమాజంలో నిత్యం జరుగుతున్న అంశాలపై స్పందిస్తూ ఉంటారు రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత పిల్లలే ప్రపంచంగా బతుకుతున్నారు రేణు దేశాయ్. తనకు తోచినంత సాయం చేయడంతో పాటు , ప్రజలు కూడా మారేలా అవగాహన కల్పిస్తుంటారు రేణు. గతేడాది తన ఎన్జీవో సంస్థ రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో పాటు ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో ఎంతో సంతోషించారు. మూగ జీవాల సంక్షేమం కోసం ఈ సంస్థ కృషి చేస్తోంది. ఈ సంస్థ కోసం రామ్ చరణ్ సతీమణి ఉపాసన విరాళం అందజేయడంతో ఆ డబ్బుతో అంబులెన్స్ సమకూర్చారు ఉపాసన.

రేణు దేశాయ్‌కి దైవభక్తి కూడా ఎక్కువే. ప్రతి నెలలో వచ్చే పండుగలు, విశిష్ట పర్వదినాలలో ఖచ్చితంగా ఇంట్లో పూజలు చేయాల్సిందే. భారతీయ సంస్కృతిని ఎంతో ఇష్టపడే ఆమె నేటి తరం కూడా సాంప్రదాయాలకు విలువ ఇవ్వాలని కోరుకుంటూ ఉంటారు. మొన్నామధ్య మగవాళ్లు ఖచ్చితంగా పంచె ఇతర ఖాదీ దుస్తులు ధరించాలని , ఈ విషయంలో సిగ్గుపడొద్దని పిలుపునిచ్చారు. తన కుమారుడు అకీరా నందన్ పంచె కట్టుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడడని రేణు పిలుపునిచ్చారు.
ఇటీవల కొడుకు, కూతురితో కలిసి కాశీ యాత్రకు వెళ్లారు రేణు దేశాయ్. ఏపీ డిప్యూటీ సీఎం తాలుకా అంటే అక్కడ వారికి సకల మర్యాదలు లభిస్తాయి. కానీ ఇద్దరు బిడ్డలను రేణు నిరాడంబరంగా ఉండేలా చూసుకుంటున్నారు. కాశీ యాత్రకు సంబంధించిన ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తాజాగా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఏపీలోని విజయవాడకు వచ్చినట్లు ఆమె తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు.
మహాత్మా జ్యోతిభా పూలే సతీమణి, దేశంలోనే తొలి మహిళా టీచర్‌గా మన్ననలు అందుకున్న బాయి పూలే 194వ జయంతి సందర్భంగా విజయవాడలో భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో రేణు దేశాయ్ పాల్గొన్నారు. మహిళల విద్య కోసం సావిత్రి బాయి పూలే ఎంతో కృషి చేశారని.. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, అందులోకి లాగొద్దని కోరారు. అయితే పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం కావడంతో హైదరాబాద్‌ను వదిలి పూర్తిగా మంగళగిరికి మకాం మార్చేశారు. నగరంలోని జనసేన కేంద్ర క కార్యాలయం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు. విజయవాడకు వచ్చిన నేపథ్యంలో ఆమె పవన్‌ను మర్యాదపూర్వకంగా ఏమైనా కలుస్తారేమో చూడాలి.


Click it and Unblock the Notifications











