పొలిటికల్ లీడర్‌తో స్టార్ హీరోయిన్ పెళ్లి ఫిక్స్.. ఎక్కడ, ఎప్పుడంటే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఎంపీ రాఘవ్ చద్దాతో ప్రేమలో పడిన ఈ భామ.. మే నెలలోనే వీరి నిశ్చితార్థం జరిగింది. ఇక ఇప్పుడు ఈ జంట పెళ్లి ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 24న ఈ జంట ఒక్కటి కానున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు వీరి వివాహానికి అనేక అనేకమంది రాజకీయ నాయకులు హాజరుకానున్నారట. పూర్తి వివరాలు.. ఈ స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇక సెప్టెంబర్ నెలలోనే వీరి పెళ్లి జరగనుందని తెలుస్తోంది. రాజస్థాన్‌ లోని ఉదయపూర్‌ వేదికగా వీరు ఒక్కటి కానున్నారు. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో లీలా ప్యాలెస్ తో పాటు ది ఒబెరాయ్ ఉదయవిలాస్‌ లో వివాహ వేడుకలు అట్టహాసంగా జరగనున్నట్లు సమాచారం.

Raghav Chada and Bollywood Heroine Parineeti chopra getting married

200 మందికి పైగా అతిథులు పరిణీతి చోప్రా, రాఘవ్ చద్ద వివాహ వేడుకలో పాల్గొంటారని సమాచారం. వీరు ఉండేందుకు పూర్తి ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. 50 మందికి పైగా వీవీఐపీ అతిథులు కూడా వివాహ వేడుకకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే రెండు హోటళ్లలో వివాహ వేడుకకు సన్నాహాలు అవుతున్నాయి.

పరిణీతి, రాఘవ్ పెళ్లికి ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా హాజరుకానున్నారట. ఆయనే కాదు... పంజాబ్ కౌంటర్ భగవంత్ మాన్ సహా పలువురు రానున్నారని సమాచారం. పరిణీతి చోప్రా కజిన్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ కూడా ఈ వేడుకలో సందడి చేయనున్నారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా వచ్చి సెలెబ్రెట్ చేయనున్నారు.

Raghav Chada and Bollywood Heroine Parineeti chopra getting married

బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం... సెప్టెంబర్ 23న హల్దీ, మెహందీ, సంగీత్‌ తో వివాహ కార్యక్రమాలు జరుగుతాయి. పరిణీతి, రాఘవ్ పెళ్లి తర్వాత, హర్యానాలోని గురుగ్రామ్‌లో రిసెప్షన్ జరగనుందని సమాచారం. లీలా ప్యాలెస్, ఉదయవిలాస్‌ తో పాటు సమీపంలోని మూడు హోటళ్లను కూడా పరిణీతి, రాఘవ్ కుటుంబ సభ్యులు బుక్ చేసుకున్నారని తెలుస్తోంది.

Raghav Chada and Bollywood Heroine Parineeti chopra getting married

ఇక వీరి నిశ్చితార్థం మే 13నే ఘనంగా ఢిల్లీోని కపుర్తలా హౌజ్ లో జరిగింది. ఇప్పుడు పెళ్లి ముహుర్తం ఫిక్స్ అవడంతో అభిమానులు ఖుష్ అవుతున్నారు. పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌ లో కలిసి చదువున్నప్పుడే వారు ఫ్రెండ్స్. అదికాస్తా ప్రేమగా మారి.. కొన్నేళ్లు ప్రేమలో మునిగి తేలారు. అప్పట్లో వీరి ఫోటోలు బయటకు రావడంతో.. విషయం బయటపడింది. ఇక చివరకు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X