త్రిష కోసం మురుగదాస్ ఏం చేస్తున్నాడో తెలుసా!
సౌత్ స్టార్ దర్శకులలో ఏఆర్ మురుగదాస్ ఒకరు. విభిన్నమైన కథలతో మురుగదాస్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంటారు. సర్కార్ లాంటి భారీ విజయం తర్వాత మురుగదాస్ చేస్తున్న తాజా చిత్రం దర్బార్. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్బార్ పై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇదిలా ఉండగా మురుగదాస్ ప్రస్తుతం ఓ చిత్రానికి కథ అందిస్తున్నట్లు తెలుస్తోంది.
హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలో ఎమ్ శరవణన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. శరవణన్ గతంలో మురుగదాస్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఈ చిత్రానికి మురుగదాస్ కథ అందిస్తున్నట్లు తెలుస్తోంది. త్రిష ప్రధాన పాత్రలో లేడి ఓరియెంటెడ్ చిత్రంగా దీనిని రూపొందించనున్నారు. గ్లామర్ రోల్స్ తగ్గిన తర్వాత త్రిష నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలపై దృష్టి పెడుతోంది.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనట్లు వార్తలు తెలుస్తోంది. త్రిష ప్రస్తుతం కొన్ని చిత్రాలతో బిజీగా గడుపుతోంది. ఆ చిత్రాలు పూర్తయిన తర్వాత శరవణన్ దర్శకత్వంలోని చిత్రం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హిట్ చిత్రం అంధాధూన్ రీమేక్ లో కూడా త్రిష నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయుష్మాన్ ఖురానా పాత్రలో సిద్దార్థ్, టబు పాత్రలో రమ్యకృష్ణ నటిస్తారట. రాధికా ఆప్టే పాత్రలో త్రిష నటించబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











