Don't Miss!
- News కవితకు బెయిల్ కోసం నిరీక్షణ తప్పదు; ఈడీ కేసులోనూ తీర్పు రిజర్వ్!!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్‌పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
Ananya Panday నువ్వేమైనా ఉర్పీ జావెద్వా? అనన్య పాండేను నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్
స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్ 2 సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన నటి అనన్య పాండే వరుసగా యూత్‌ఫుల్ సినిమాలు చేస్తూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంది. ఈ నాజూకు భామ ప్రస్తుతం యంగ్ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'లైగర్' లో నటిస్తోంది. ఈ సినిమాతో తెలుగుతోపాటు దక్షిణాదిన అన్ని భాషల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఎప్పుడూ ట్రెండీగా, గ్లామరస్‌గా కనిపించే అనన్య ఫ్యాషన్ సెన్స్ తాజాగా కాస్త దెబ్బతింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా పుట్టిన రోజు పార్టీకి హాజరైన అనన్య వెరైటీ డ్రెస్‌తో ట్రోలర్స్‌కు టార్గెట్‌గా మారింది.
|
విజయ్ దేవరకొండతో హల్చల్
ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా బర్త్ డే పార్టీలో లైగర్ టీమ్ సందడి చేసింది. టీమ్ మొత్తం ఔట్ అండ్ ఔట్ బ్లాక్ డ్రెస్‌లు ధరించి ఆ పార్టీకి హాజరైంది. మరీ ముఖ్యంగా అనన్య ధరించిన డ్రెస్ అందరినీ సర్‌ప్రైజ్‌కి గురిచేసింది.
పార్టీలో అనన్య పాండే-విజయ్ దేవరకొండ మధ్య చిట్‌చాట్‌ని నిర్మాత చార్మి తన ఇన్‌స్టా అకౌంట్లో పోస్ట్ చేసింది. మై స్టన్నింగ్ లైగర్ కపుల్ అంటూ ఆ వీడియోను షేర్ చేసింది. ఈ పార్టీకి హీరోయిన్లు కత్రినా కైఫ్, రకుల్ ప్రీత్ సింగ్, జాన్వీ కపూర్, హీరో విక్కీ కౌశల్ తదితరులు హాజరయ్యారు.
సోషల్ మీడియాలో అందాల విందు..
హిందీ స్టార్ నటుడు చుంకీ పాండే కూతురిగా తెరంగేట్రం చేసిన అనన్య పాండే అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనన్యా పాండే తరచుగా తన హాట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అనన్యకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇటీవల అనన్య పోస్ట్ చేసిన హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
లైగర్‌తో భారీ స్థాయిలో..
యంగ్ హీరో విజయ్ దేవరకొండతో పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న లైగర్ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రూపోందుతుంది. లైగర్‌ను ఛార్మి, ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ సిల్వర్ స్క్రీన్ పై మెరువబోతుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ సినిమాను ఆగస్టు 25న విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
బ్లాక్ డ్రెసెలో సూపర్ హాట్..
అపూర్వ మెహతా పుట్టిన రోజు పార్టీకి హాజరైన అనన్య హాట్ బ్లాక్ డ్రెస్‌లో మెరిసింది. థై హై స్లిట్తో ఇన్నర్స్ కనిపించేలా అనన్య వేసుకొచ్చిన డ్రెస్ సెన్సేషన్‌గా మారింది. ఆ పార్టీలో అనన్య స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ డ్రెస్‌పై కొందరు నెటిజన్లు ట్రోలింగ్ ప్రారంభించారు. హిందీ బిగ్‌బాస్ ఓటీటీ షోతో పాపులారిటీ సాధించిన ఉర్ఫీ జావేద్‌తో అనన్యని పోలుస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంత చెత్త ఫ్యాషన్ సెన్స్ ఎక్కడ చూడలేదంటూ విమర్శలు చేస్తున్నారు. చెత్త డ్రెస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఉర్ఫీ జావేద్‌పై ట్రోలింగ్..
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాళ్లకి పెద్దగా పరిచయం అక్కర లేని పేరు ఉర్ఫీ జావేద్. బిగ్‌బాస్ ఓటీటీతో గుర్తింపు పొందిన ఈ భామ తరచుగా ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో తన ఫొటోలు, వీడియోలతో మంటలు రేపుతుంటుంది. వెరైటీ వెరైటీ డ్రెస్సులతో కుర్రాకారును కవ్విస్తుంటుంది. ఆమె ఫ్యాషన్ సెన్స్ తరచుగా విమర్శల పాలవుతుంటుంది. ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌పై ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఉర్పీ అసలు లెక్క చేయదు. అసభ్యకర కామెంట్స్‌కు స్పందించదు.