Shalini Pandey: మరింత రెచ్చిపోతున్న అర్జున్ రెడ్డి బ్యూటీ.. అతి చిన్న నిక్కరులో ఫస్ట్ టైమ్ ఇలా..

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శాలిని పాండే ఏ స్థాయిలో గుర్తింపును అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక అందులో బోల్డ్ సన్నివేశాల్లో కూడా ఆమె ఊహించని విధంగా కనిపించి ఓ వర్గం యువతను ఎంతగానో అట్రాక్ట్ చేసింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేస్తున్న ఫోటోలు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇటీవల శాలిని పాండే మొదటి సారి అతి చిన్న నిక్కరులో కనిపించిన విధానం షాక్ కు గురి చేస్తోంది. ఆ ఫోటో వివరాల్లోకి వెళితే..

మొదటి సక్సెస్ తరువాత

మొదటి సక్సెస్ తరువాత

టాలెంటెడ్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న శాలిని పాండే మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవడంతో చాలా ఈజీగా స్టార్ హీరోయిన్ గా గుర్తింపును అందుకుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఆమె బ్యాడ్ లాక్ కారణంగా మళ్ళీ ఆ తర్వాత అర్జున్ రెడ్డి లాంటి సినిమా రాలేదు. చాలా వరకు ఆ తర్వాత చేసిన సినిమాలు ఏదో నామమాత్రంగానే బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యాయి.

మంచి సపోర్టింగ్ రోల్స్

మంచి సపోర్టింగ్ రోల్స్

అయితే శాలిని పాండే కేవలం హీరోయిన్ గానే కాకుండా కొన్ని మంచి సినిమాల్లో కంటెంట్ ఉన్న సైడ్ క్యారెక్టర్స్ లో కూడా నటించేందుకు ఒప్పుకుంది. ముఖ్యంగా మహానటిలో సావిత్రి స్నేహితురాలిగా కనిపించిన విషయం తెలిసిందే. ఆ పాత్ర కూడా ఆమెకు మంచి గుర్తింపు లభించింది. కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా అలాంటి పాజిటివ్ రోల్స్ లో కూడా ఆమె చక్కగా నటిస్తుంది అని క్రేజ్ తెచ్చుకుంది.

కొంతకాలం అలా..

కొంతకాలం అలా..

అయితే మహానటి తర్వాత మళ్లీ ఎన్టీఆర్ బయోపిక్ లో షావుకారు జానకిగా కనిపించింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ 118 సినిమా లో ఆమె చేసిన పాత్ర కూడా బాగానే క్లిక్ అయింది. ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా శాలిని పండే నటిగా కొంతకాలం బిజిగానే కనిపించింది.

తగ్గిన సినిమాలు

తగ్గిన సినిమాలు


అయితే శాలిని పాండేకు హీరోయిన్ గా అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రావడం లేదు. చివరగా ఆమె తెలుగులో రాజ్ తరుణ్ తో ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాలో నటించింది. అలాగే అనుష్క నిశ్శబ్దం సినిమాలో ఒక సైడ్ క్యారెక్టర్ లో కనిపించింది. ఈ సినిమాల తర్వాత మళ్లీ ఆమె తెలుగులో కనిపించింది లేదు.

పొట్టి నిక్కరులో..

పొట్టి నిక్కరులో..

కానీ శాలిని పాండే గ్లామర్ అందాలతో మాత్రం సోషల్ మీడియా ద్వారా జనాలను అట్రాక్ట్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా బికినీ అందాలతో కూడా మొదటిసారి ఆమె షాక్ ఇచ్చింది. రీసెంట్ గా మరోసారి శాలిని పాండే ఒక పొట్టి నిక్కరులో కూర్చున్న విధానం ఓవర్గం కుర్రాళ్లను స్టన్ అయ్యేలా చేస్తోంది. గ్లామరస్ పాత్రల్లో కూడా కనిపించడానికి రెడీ అని ఈ విధంగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది.

ఒకే ఒక్క సినిమా?

ఒకే ఒక్క సినిమా?

ప్రస్తుతం శాలిని పాండే చేతుల్లో అయితే పెద్దగా సినిమాలు ఏమీ లేవు. కేవలం ఒక హిందీ సినిమా మాత్రమే ఉంది. అందులో కూడా ఆమె ఒక చిన్న పాత్రలోనే నటిస్తున్నట్లు సమాచారం. ఇక తెలుగులో కొన్ని మీడియం బడ్జెట్ సినిమాల్లో అవకాశం కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో శాలిని పాండే ఎలాంటి పాత్రలో కనిపిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X