For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నడుమును సన్నగా మార్చేసిన అర్జున్ రెడ్డి బ్యూటీ.. చినిగిన బట్టలతో షాకింగ్ లుక్

  |

  సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి వారైనా సరే కాలాన్ని బట్టి ఎప్పటికప్పుడు ట్రెండ్ ని బట్టి ఒక్కోసారి తప్పక మారాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. సిద్ధాంతాన్ని మర్చిపోయే వారు రంగుల ప్రపంచంలో చాలా తక్కువమంది ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గ్లామర్ విషయంలో మార్పులు రావడం అనేది కామన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ట్రెండ్ ని అనుసరించకపోతే ప్రేక్షకులు తమను మర్చిపోతారేమో, పెద్దగా పట్టించుకోరేమో అనే భయం వారి మదిలో వెంటాడుతుందనేది వాస్తవం. ఇక మనం ఇప్పుడు ఇదంతా ఎందకు చెప్పుకుంటున్నాము అంటే, ప్రస్తుతం చాలామంది నటీమణులు నడుస్తున్న ట్రెండ్ లో ఎక్కువగా సన్నగా నాజూగ్గా కనబడుతున్నారు. అలాంటి వారిలో అర్జున్ రెడ్డి బ్యూటీ కూడా చేరిపోయింది.

  అర్జున్ రెడ్డి బ్యూటీ కూడా

  అర్జున్ రెడ్డి బ్యూటీ కూడా

  బొద్దుగుమ్మలు కూడా ఉన్నప్పటికీ ఎంత బక్క చిక్కితే అంత అందం అన్నమాట. అయితే ఇదే సూత్రాన్ని ఇటీవల అనేకమంది సినిమా హీరోయిన్స్ పాటిస్తుండగా లేటెస్ట్ గా వారి జాబితాలో అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే కూడా చేరింది. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగ తీసిన ఆ సినిమాలో ప్రీతి అనే పాత్రలో ఎంతో బొద్దుగా కనపడింది. ఆ పాత్రలో తన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో అందరి నుండి మంచి పేరు సంపాదించారు.

  అవకాశాలు బాగానే వచ్చినప్పటికీ..

  అవకాశాలు బాగానే వచ్చినప్పటికీ..

  అయితే సినిమా సూపర్ హిట్ కొట్టడంతో ఆమెకు మంచి క్రేజ్ లభించి ఆపై తనకు మంచి ఛాన్స్ లు వచ్చాయి. తరువాత ఆమె కళ్యాణ్ రామ్ 118, అనుష్క శెట్టి నిశ్శబ్దం, కీర్తి సురేష్ మహానటి, బాలయ్య చేసిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఇక ఇటీవల రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ఇద్దరి లోకం ఒక్కటే సినిమాల్లో నటించారు. అయితే ఆమె నటించిన సినిమాలేవీ కూడా ఆమెకు ఆశించిన స్థాయిలో పేరుని, గుర్తింపుని అందివ్వలేదు.

   చినిగిన జీన్స్ లో..

  చినిగిన జీన్స్ లో..

  కాగా ప్రస్తుతం జయేష్ భాయ్ జొర్దర్, మహారాజ అనే రెండు హిందీ సినిమాల్లో యాక్ట్ చేస్తున్న షాలిని పాండే, చూస్తుంటే ఇకపై బాలీవుడ్ సినిమాలపైనే ఆమె ఎక్కువగా ఆసక్తి కనపరుస్తుందేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఇటీవల షాలిని పూర్తిగా సన్నబడింది. కొద్దీరోజులుగా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తున్న ఫోటోలను చూస్తున్న ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. చినిగిన జీన్స్ లో కూడా అమ్మడు సెక్సీగా స్టిల్స్ ఇచ్చింది. దీంతో కొందరు నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

  Suryasthamayam Movie Impresses Producer Raj Kandukuri
  అవకాశాల కోసమే.. ఇలా..

  అవకాశాల కోసమే.. ఇలా..


  అయితే ప్రస్తుతం షాలిని మాత్రమే కాదు దాదాపుగా అనేకమంది హీరోయిన్స్ సన్నబడడానికి కారణం మరిన్ని అవకాశాల కోసమే అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎంతైనా హీరోయిన్స్ ట్రెండ్ కి తగ్గట్లుగా నడుచుకోవాల్సిందే అని మరికొందరు పాజిటివ్ గా స్పందించారు. ఇక నేడు షాలిని బ్లాక్ కలర్ టీ షర్ట్, చిరిగిన స్టైల్ లో ఉండే బ్లు డెనిమ్ జీన్స్ వేసుకుని దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి. మరి ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో షాలిని ఎంతవరకు సక్సెస్ ని క్రేజ్ ని దక్కించుకుంటారో చూడాలి.

  English summary
  Arjun reddy actress shalini pandey latest look viral,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X