Shalini Pandey: ఘాటైన ఫోజులతో అర్జున్ రెడ్డి భామ హంగామా.. షాలిని పాండే లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్
కొంతమంది హీరోయిన్స్ బ్యాడ్ లక్ ఏమిటో గాని గ్లామర్ తో ఎంతగా ఆకట్టుకున్నప్పటికీ కూడా సరైన అవకాశాలు దొరకడం లేదు. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న వారు కూడా ఆ తర్వాత అదే తరహాలో సినిమా అవకాశాలు కూడా అందుకోలేకపోతున్నారు. ఇక అదే తరహాలో సతమతమవుతున్న వారిలో అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ బ్యూటీ నటిగా తనను తాను ఎప్పటికప్పుడు సరికొత్తగా ప్రజెంట్ చేసుకుంటూనే ఉంది. ఇక గ్లామర్ విషయంలో కూడా ఆమె ఎంతగానో అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. సోషల్ మీడియాలో రీసెంట్ గా అమ్మడు పోస్ట్ చేసిన మరికొన్ని ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఆ వివరాలలోకి వెళితే..
మొదటి అడుగులోనే బిగ్ హిట్: అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ షాలిని పాండే. ఈ అమ్మడు మొదటి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. హీరోయిన్ కావాలనే ఆమె డ్రీమ్ కి కూడా అర్జున్ రెడ్డి మూవీ బ్రేక్ ఇచ్చింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ వచ్చింది. అయితే అర్జున్ రెడ్డి తర్వాత మరల ఆ స్థాయి సక్సెస్ ఆమె ఖాతాలో పడలేదు.

వరుసగా డిఫరెంట్ సినిమాలు: అర్జున్ రెడ్డి తర్వాత మహానటి సినిమాలో సావిత్రి ఫ్రెండ్ పాత్రలో షాలిని పాండే నటించింది. తరువాత 118లో కళ్యాణ్ రామ్ కి జోడీగా కనిపించి మెప్పించింది. అలాగే తమిళంలో 100% లవ్ రీమేక్ లో నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. ఇక నిశ్శబ్దం సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. అలాగే రాజ్ తరుణ్ కి జోడీగా ఓ మూవీ చేసింది.

బాలీవుడ్ లో కూడా అవకాశాలు: ఇలా వరుస అవకాశాలు తెచ్చుకున్న షాలిని పాండే కమర్షియల్ సక్సెస్ లు మాత్రం అందుకోలేదు. దీంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడ తన అదృష్టం పరీక్షించుకునే పనిలో పడింది. గత ఏడాది జయషేభాయ్ జోర్ధార్ మూవీలో రణవీర్ సింగ్ కి జోడీగా నటించింది. ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. అయితే బాలీవుడ్ లోకి వెళ్ళిన తర్వాత షాలిని పాండే జీరో సైజ్ లోకి వచ్చేసింది.

ఘాటైన పోజులతో షాక్ ఇచ్చిన షాలిని: బొద్దుగుమ్మ నుంచి స్లిమ్ లుక్ లోకి వచ్చేసి గ్లామర్ షోకి తెరతీసింది. రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్ లు చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ కి కావాల్సినంత వినోదం అందిస్తోంది. ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా హాట్ హాట్ అందాలని ఆరబోస్తూ కుర్రకారుకి సెగలు రేపుతోంది. తాజాగా మరోసారి షాలిని పాండే అదిరిపోయే ఘాటైన పోజులతో మెస్మరైజ్ చేస్తోంది. స్లీవ్ లెస్ జాకెట్ తో ఎద అందాలని హాట్ భంగిమలతో చూపిస్తోంది. అలాగే బ్లాక్ కలర్ షార్ట్ ని థైస్ అందాలు కనిపించే విధంగా వేసుకొని లుక్స్ తో కుర్రాళ్ళకి కిక్ ఇస్తోంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











