చెమటతో తడిసి ముద్దయిన అర్జున్ రెడ్డి లవర్... ఇదేం గ్లామర్ ట్రీట్ రా బాబూ!
చిత్ర సీమ విచిత్రమైనది .. కొందరు స్టార్‌డమ్ కోసం ఏళ్లకు ఏళ్లు శ్రమిస్తుంటే, ఇంకొందరు మాత్రం ఓవర్‌నైట్ స్టార్స్ అయిపోతారు. కానీ ఈ స్టార్‌డమ్‌ని నిలబెట్టుకోవడమే పెద్ద టాస్క్. ఈ పరీక్షలో ఫెయిలై అడ్రస్ లేకుండాపోయిన వారెందరో. ఈ కోవలోకే వస్తారు అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే. ఈ చిత్రంతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ తర్వాత ఎందుకో వెనుకబడ్డారు. ప్రస్తుతం ఉనికిని చాటుకునే పనిలో బిజీగా ఉన్నారు షాలిని పాండే.
అర్జున్ రెడ్డితో ఓవర్‌నైట్ స్టార్‌గా
మధ్యప్రదేశ్‌కు చెందిన షాలిని పాండే బీటెక్ గ్రాడ్యుయేట్. చిన్నప్పటి నుంచి సినిమాలపై పిచ్చితో నాటకాలు వేసింది. ఈ దశలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డిలో ఆమెకు అవకాశం వచ్చింది. తెలుగు అమ్మాయి కాకపోయినా తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుని శెభాష అనిపించుకుంది. అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ కావడంతో షాలిని పాండే పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. క్యూట్ లుక్స్‌కు తోడు మంచి నటిగా మార్కులు తెచ్చుకున్న షాలినీ ఖచ్చితంగా టాలీవుడ్‌ను దున్నేస్తుందని అంతా భావించారు.

స్టార్‌డమ్ నిలబెట్టుకోలేక తిప్పలు
అర్జున్ రెడ్డి తర్వాత షాలినీ పాండేకు ఆఫర్లు క్యూకట్టాయి. మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 118, ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్ధం వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడంతో షాలినీ కెరీర్ డైలమాలో పడింది. తెలుగులో దారులు మూసుకుపోవడంతో కోలీవుడ్, బాలీవుడ్‌లపై ఫోకసపెట్టి అప్పుడప్పుడు అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం తమిథంలో ఇడ్లీ కడాయ్ అనే సినిమాలో షాలిని పాండే నటిస్తున్నారు.
ఓటీటీలపై షాలినీ ఫోకస్
ఓటీటీలకు ఇండియాలో పెరుగుతున్న మార్కెట్‌ను, దాని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓటీటీలో పలు వెబ్ సిరీస్ ఇతర ప్రాజెక్ట్స్ చేస్తున్నారు షాలినీ. హిందీలో జునైద్ ఖాన్‌తో నటించిన మహారాజ్ సినిమా ఓటీటీలో రిలీజై ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో నటనకు గాను బెస్ట్ పాపులర్ నటిగా ఓ అవార్డ్ అందుకుంది. దీంతో ప్రస్తుతానికి సిల్వర్ స్క్రీన్‌ను పక్కనపెట్టి.. ఓటీటీలపై ఫోకస్ పెట్టింది షాలినీ పాండే. అయితే షాలినీ పాండేకు ఆటిట్యూడ్ ఎక్కువని.. అందుకే ఆమెను సినిమాల్లోకి తీసుకోవడానికి దర్శక నిర్మాతలు ఆలోచించే పరిస్థితి ఉందని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తన పాత్ర నిడివి, ఇంపార్టెన్స్, రెమ్యునరేషన్ విషయంలో షాలినీ ఖచ్చితంగా ఉండటం తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇదే ఆమె కెరీర్‌కు మైనస్‌గా మారిందని అంటున్నారు.
చెమటలు కక్కిన ముద్దుగుమ్మ
ఇకపోతే.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే షాలినీ పాండే ఎప్పటికప్పుడు తన సినిమాలు, ఇతర ప్రాజెక్ట్స్ గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటోషూట్‌లతో కుర్రాళ్లకు సెగలు రేపుతుంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు సెగలు రేపుతున్నాయి. సమ్మర్‌లో వైట్ షర్ట్ వేసుకుని చెమటికి తడిసిముద్దయిన షాలినీ.. తడి అందాలతో కవ్విస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి షాలినీ అందాలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











