ప్రియుడితో పెళ్లిపీటలెక్కబోతున్న చిన్నజేజమ్మ..వరుడు ఎవరంటే?

ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బజాలు మోగుతున్నాయి. ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు తమ మనసుకు నచ్చిన వారితో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధమవుతున్నారు. అలా తమ ప్రేమ బంధాన్ని వివాహ బంధంతో దృఢపరుచుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్, చిన్ని జేజమ్మ తన ప్రియుడితో కలిసి పెళ్లి పీటలెక్కబోతుంది. ఇంతకీ ఆ చిన్న జేజమ్మ ఎవరు? ఇంతకీ ఆ వరుడు ఎవరు? ఓ లూక్కెయ్యండి.

ఆ చిన్న జేజమ్మ ఎవరో కాదు.. అరుంధతి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైంది దివ్య గణేష్. ఈ అమ్ముడు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అరుంధతి సినిమాతో అనుష్క శెట్టి , నటుడు సోను సూద్ లకు ఎంతటి గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అలాంటి స్థాయిలోనే దివ్య నాగేష్ కు గుర్తింపు వచ్చింది. అరుంధతి సినిమాలో ఈ అమ్మడు నటనకు నంది అవార్డు సైతం చేరువైంది.ఈ సినిమాలో దివ్య గణేష్ తన కండ్లతో, నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది.

Arundhati Movie Child Artist Divya Nagesh Engaged To her lover Aji Kumar Photos Here

ఆ తర్వాత పలు చిత్రాలలో నటించింది. కానీ, ఆమె ఊహించినంత స్థాయిలో గుర్తింపు రాలేదని చెప్పాలి. దీంతో సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది. కానీ, నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు.. తరుచు తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకులకు తన అభిమానులకు చేరువలోనే ఉంటుంది. అలా తాజాగా దివ్య గణేష్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఓ ఇంపార్టెంట్ అప్డేట్ను తన అభిమానులతో పంచుకుంది.

నటి దివ్య నగేష్ తన పోస్టులో తన ప్రియుడు, స్నేహితుడు అయినా అజి కుమార్ తో ఎంగేజ్మెంట్ జరిగినట్లు చెప్పుకొచ్చింది. ఆ ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. 'కొన్ని ప్రయాణాలు చేయడం చాలా కష్టమని భావించినప్పుడు మీరు నిశ్శబ్దంగా వాటి గుండా నడవడానికి నాకు సహాయం చేశారు' అంటూ ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని రాసింది.. అంతేకాదు తనకు కష్ట కాలంలో అండగా నిలిచిన తన ప్రియుడు ఇప్పుడు తన జీవిత భాగస్వామి కాబోతుండడం చాలా సంతోషంగా ఉందంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది దివ్య నగేష్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ జంటకు సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు కామెంట్స్ చేస్తూ.. తమ విషెస్ తెలుపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X