ఆయన గట్టిగా వాటేసుకొని ముద్దు పెట్టుకొన్నాడు.. ఆషా నేగి
బారిష్ వెబ్ సిరీస్ విజయవంతం కావడం, తన నటనకు మంచి పేరు రావడంతో అందాల భామ ఆషా నేగి సంతోషంలో మునిగిపోయారు. శర్మాన్ జోషితో రెండోసారి జతకట్టి నటించిన బారిష్ చిత్రంలో తన ఫెర్ఫార్మెన్స్‌పై సంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన విశేషమేమిటంటే.. అలనాటి సూపర్‌స్టార్ జితేంద్ర బారిష్ ద్వారా వెబ్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే.
ఇక వెబ్ సిరీస్‌లో శర్మాన్ జోషితో కిస్ సిన్స్‌పై ఆషా నేగి స్పందిస్తూ.. నేను ఇంతకు ముందు ఆన్‌స్క్రీన్‌పై కిస్ పెట్టుకొన్న అనుభవం చేయలేదు. దాంతో చాలా నెర్వస్‌గా ఫీలయ్యాను అని తెలిపారు.

బారిష్ సీజన్ 2లో లిప్‌లాక్, కిసెస్ సీన్లు నాకు ఓ ఛాలెంజ్‌గా మారాయి. శర్మాన్ పాత్ర అంటే నాకు కోపం విపరీతంగా వచ్చింది. నేను బిక్కముఖం వేసి చూస్తుంటే.. శర్మన్ సడెన్‌గా వచ్చి నన్ను పట్టుకొని ముద్దు పెట్టుకొన్నారు. అలాంటి సిట్యుయేషన్ నాకు చాలా కష్టంగా, ఇబ్బందిగా అనిపించింది అని అషా నేగి చెప్పింది.
ఎలాంటి సీన్లలో ఎలా నటించాలనే విషయం నాకు యాక్టర్‌గా కొంత అనుభవం వచ్చింది. ఏది చేయాలో, ఏది చేయకూడదనే విషయాలను నేర్చుకొంటున్నాను. నా ఫెర్ఫార్మెన్స్, కెరీర్‌కు ఆటంకంగా మారే ఈ పనిని నేను చేయను అని ఆషా నేగి చెప్పుకొంటు వచ్చారు.


Click it and Unblock the Notifications











