Asha Parekh 70 ఏళ్ల సినీ ప్రయాణం.. హృదయాలను కొల్లగొట్టి..పెళ్లికి దూరంగా.. ఆ డైరెక్టర్‌తో బ్రేకప్!

బాలీవుడ్ దిగ్గజ నటి, దర్శకురాలు, నిర్మాత ఆశా పరేఖ్ నట కిరీటంలో మరో కలికితురాయి చేరింది. 70 ఏళ్ల సినీ ప్రయాణంలో ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు అందుకొన్న ఆమెను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించనున్నది. ఆశా పరేఖ్‌కు ఫాల్కే అవార్డును అందజేస్తున్నట్టు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అధికారికంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆశా పరేఖ్ నట, వ్యక్తిగత జీవితం విషయంలోకి వెళితే..

 గుజరాతీ ఫ్యామిలీ నుంచి

గుజరాతీ ఫ్యామిలీ నుంచి


గుజరాతీ ఫ్యామిలీకి చెందిన ఆశా పరేఖ్ 1942లో బొంబాయిలో జన్మించింది. తన వయసు 10 ఏళ్ల ఉండగానే.. అంటే 1952లో భేటీ అనే చిత్రం ద్వారా బాలనటిగా హిందీ చిత్ర పరిశ్రమకు ప్రముఖ దర్శకుడు బీమల్ రాజ్ పరిచయం చేశారు. ఆ తర్వాత బీమల్ రాయ్ తన దర్వకత్వంలో వచ్చిన బాప్ భేటీ సినిమాలో అవకాశం లభించింది. అయితే ఈ సినిమా ఫెయిల్ కావడంతో చదువు కోసం యాక్టింగ్‌కు దూరంగా ఉన్నారు.

 16 వయసులో హీరోయిన్‌గా

16 వయసులో హీరోయిన్‌గా


ఆశా పరేఖ్ తన చదువును పూర్తి చేసుకొని 16 ఏళ్ల వయసులో హీరోయిన్‌గా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో దర్శకుడు విజయ్ భట్.. తాను రూపొందించే గూంజ్ ఉతి షెనాయ్ చిత్రంలో అవకాశం ఇచ్చారు. అయితే వారం రోజుల తర్వాత ఆమె హీరోయిన్‌గా పనికిరారు. ఆమెలో యాక్టర్ లేదు అంటూ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారు. ఇలాంటి చేదు అనుభవం ఎదురైన 8 రోజుల్లోనే ప్రముఖ దర్శకుడు నాసిర్ హుస్సేన్ రూపొందించే దిల్ దేఖే దోఖో చిత్రంలో అవకాశాన్ని చేజిక్కించుకొన్నది.

నాసిర్ హుస్సేన్‌తో వరుస చిత్రాలు

నాసిర్ హుస్సేన్‌తో వరుస చిత్రాలు


దిల్ దేఖే దేఖో చిత్రం ఆశా పరేఖ్ జీవితాన్ని మార్చేసింది. ఆ సినిమా తర్వాత వరుసగా ప్రముఖ దర్శకుడు, ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ పెదనాన్న నాసిర్ హుస్సేన్ దర్శకత్వంలో వచ్చిన 6 చిత్రాల్లో అంటే జబ్ ప్యార్ కిసి సే హోతా హై, ఫిర్ వోహి దిల్ లాయా హు, తీస్రీ మంజిల్, బాహరోం కే సప్నే, ప్యార్ కా మౌసమ్, కార్వాన్, యాదోంకి బారాత్, హమ్ కిసీ సే కమ్ నహీ చిత్రాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకొన్నారు.

 నాసిర్ హుస్సేన్‌తో డేటింగ్..

నాసిర్ హుస్సేన్‌తో డేటింగ్..


నాసిర్ హుస్సేన్ దర్శకత్వంలో వరుస చిత్రాల చేసిన తర్వాత ఆశా పరేఖ్ ఆయనతో డేటింగ్ చేసినట్టు ఆ సమయంలో బాలీవుడ్లో రూమర్లు వచ్చాయి. అయితే నాసిర్ హుస్సేన్‌తో తన ప్రేమ బంధాన్ని ఆశా పరేఖ్ కూడా అధికారికంగా ధృవీకరించారు. తన ఆత్మకథ ది హిట్ గర్ల్ పుస్తకంలో కూడా స్వయంగా ఆమె వెల్లడించడం గమనార్హం.

అమెరికన్‌తో పెళ్లి వరకు వచ్చి..

అమెరికన్‌తో పెళ్లి వరకు వచ్చి..


అయితే తన జీవితాతం బ్రహ్మచారిణిగానే ఆశా పరేఖ్ మిగిలిపోయారు. తన పాపులారిటీని చూసి ఎవరూ కూడా తనను పెళ్లి చేసుకోవడానికి సాహసించలేదు. అందుకే నా జీవితంలో పెళ్లి అనేది సాధ్య పడలేదు. నేను దర్శకుడు నాసిర్ హుస్సేన్‌తో రొమాంటిక్ జీవితాన్ని గడిపాను అని తన ఆత్మ కథ ది హిట్ గర్ల్ పుస్తకంలో తెలిపారు. ఆ తర్వాత అప్పటికే ఓ గర్ల్ ఫ్రెండ్ ఉన్న అమెరికన్‌తో ఆశా పరేఖ్ బంధం పెళ్లి వరకు వచ్చింది. అయితే ఆ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్‌ను వదులుకోవడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల అతడికి గుడ్ బై చెప్పారనే విషయాన్ని ఆమె చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X