జపాన్ లో ఆషిక రంగనాథ్ అందాల విందు.. కొంటె చూపుతో కన్నడ భామ కవ్వింపు

అందం, అభినయం ఉన్నప్పటికీ సరైన బ్రేక్ కోసం కష్టపడుతున్నారు కన్నడ నటి ఆషికా రంగనాథ్. తన మాతృభాషలో సత్తా చాటినప్పటికీ.. తెలుగులో మాత్రం ఇంత వరకు ఆమెకు సరైన హిట్ పడలేదు. అయినప్పటికీ నిరాశ చెందకుండా ప్రయత్నిస్తున్నారు ఈ ముద్దుగుమ్మ. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభరలో నటిస్తున్నారు ఆషికా రంగనాథ్. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆషికా .. తాజాగా తన జపాన్ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

కర్ణాటకలోని తమకూరుకు చెందిన ఆషికా.. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే మోడలింగ్ వైపు వెళ్లారు. క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగళూరు కాంటెస్ట్‌లో పాల్గొన్నారు, 2014లో మిస్ ఫ్రెష్ ఫేస్ 2014లో రన్నరప్‌గా నిలిచారు ఆషికా రంగనాథ్. వెస్ట్రన్ డ్యాన్స్ స్టైల్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు. 2016లో క్రేజీ బాయ్స్ సినిమాలో నటించిన ఆషికా.. ఆ తర్వాత మాస్ లీడర్, రాజు కన్నడ మీడియం, రాంబో 2, కోటిగొబ్బ 3, మదగజ, జేమ్స్, అవతార పురుష, గరుడ తదితర కన్నడ సినిమాలలో నటించారు.

Ashika Ranganath enjoyed food in Japan vacation She shares cute pics from their travel

2023లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అమిగోస్ అనే మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు ఆషిక రంగనాథ్. ఆ వెంటనే కింగ్ అక్కినేని నాగార్జున సరసన నా సామీ రంగ సినిమాలో నటించారు. అయినప్పటికీ టాలీవుడ్‌లో అవకాశాలు రాకపోవడంతో కన్నడ, తమిళ చిత్రాలపై దృష్టి పెట్టింది ఆషిక. తిరిగి ఈ ఏడాది రవితేజ హీరోయిన్‌గా వచ్చిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో మరోసారి తెలుగు వారిని పలకరించింది ఈ ముద్దుగుమ్మ. ఈ మూవీ ఓ మాదిరి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర, తమిళంలో కార్తీ సరసన సర్దార్ 2 సినిమాలో ఆషిక రంగనాథ్ నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపైనే ఆమె ఆశలు పెట్టుకున్నారు.

సినిమాలతో పాటు సామాజిక అంశాలపైనా ఆషిక గళమెత్తుతుంటారు. ఇటీవల పెద్ది సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్‌ పాత్ర, హీరోయిన్లను చూపించే విధానంపై చోటు చేసుకున్న వివాదంపై ఆషిక తీవ్రంగా స్పందించారు. భారీ రెమ్యునరేషన్ కోసమే హీరోయిన్లు.. స్టార్ల చిత్రాలలో నటిస్తున్నారన్న కథనంపై ఆమె మండిపడ్డారు. హీరోయిన్లను నిందించొద్దని, ఇప్పటికీ ఇలాంటి గ్లామర్ పాత్రలే సేల్ అవుతాయని నమ్ముతున్న సినీ పరిశ్రమను, దర్శకులను తప్పుపట్టాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు అందుబాటులో ఉన్న అవకాశాల పరిధిలోనే నటీనటులు పనిచేయాల్సి ఉంటుంది, పాత్ర సరిగా లేదంటే అది రాసిన రైటర్లదే తప్పు. అంతేకానీ ఆయా పాత్రలను పోషించిన హీరోయిన్లది కాదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఆషికా రంగనాథ్.

తీరిక వేళల్లో విహారయాత్రలకు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు ఆషికా రంగనాథ్. తాజాగా కాస్త విరామం దొరకడంతో జపాన్ టూర్‌కు వెళ్లారు ఈ ముద్దుగుమ్మ. అక్కడి ప్రకృతి అందాలను, చారిత్రక కట్టడాలను తిలకిస్తూ.. ఎగ్జిబిషన్స్‌లో అల్లరి చేస్తూ.. జపాన్‌కే ప్రత్యేకమైన స్ట్రీట్ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఆషిక. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతుండగా.. ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌కి నెటిజన్లు ఫన్నీ ఎమోజీలు పెడుతున్నారు.

Read more about: ashika ranganath vishwambhara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X