ఆ హీరో లాంటి వాడినే పెళ్లి చేసుకుంటా.. ఆషిక రంగనాథ్

కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్‌లో జెండా పాతాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు ఆషికా రంగనాథ్. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అమిగోస్ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆషికా.. అందం, నటనపరంగా మంచి మార్కులు వేయించుకుంది. ఆ వెంటనే కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన నా సామీ రంగా సినిమాలో హీరోయిన్‌గా నటించారు. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైన ఆషికా రంగనాథ్.. తన మాతృభాష కన్నడంతో పాటు తమిళ చిత్రాలపై ఫోకస్ పెట్టి స్టార్ హీరోయిన్ అనిపించుకుంది.

ప్రస్తుతం తెలుగులోనూ ఆషికకు అవకాశాలు క్యూకడుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో వస్తోన్న విశ్వంభర సినిమాలో ఆషిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే దాని కంటే మూవీ మరో సినిమాతో ఆమె ప్రేక్షకులను పలకరించనున్నారు. అదే భర్త మహాశయులకు విజ్ఞప్తి. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా విడుదల కానుంది.

Ashika Ranganath Opens Up About Tollywood Journey and Her Future Husband Qualities

భర్త మహాశయులకు విజ్ఞప్తిలో ఆషికాతో పాటు డింపుల్ హయాతి కూడా హీరోయిన్‌గా నటిస్తున్నారు. సునీల్, సత్య, వెన్నెల కిశోర్, సుధాకర, మురళీధర్ గౌడ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. బీమ్స్ సిసిరిలియో సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఏ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, ప్రసాద్ మూరేళ్ల సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా ఓ తెలుగు వార్తా సంస్థకు హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు పంచుకున్నారు. అలాగే తన పెళ్లి, కాబోయే భర్త ఎలా ఉండాలి అనే విషయాలు తెలిపారు. ఈ వివరాల్లోకి వెళితే..

మూవీ చూస్తే అసలు ఎందుకు భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే టైటిల్ పెట్టారు అనేది కరెక్ట్‌గా తెలుస్తుంది. కుటుంబం, ఫన్ అన్ని సినిమాలో ఉంటాయి. భర్త జీవితంలోకి ఇంకో అమ్మాయి వస్తే ఏం జరుగుతుంది. ఇప్పుడున్న రిలేషన్స్, పెళ్లిళ్లు దానికి ఉన్న కన్‌ఫ్యూజన్స్‌ని హ్యూమర్‌తో పాటు చెప్పబోతున్నాం. ఈ జనరేషన్‌లోని ప్రతి ఒక్కరికి మా సినిమా కనెక్ట్ అవుతుంది. ఆల్రెడీ పెళ్లి అయినవాళ్లే కాదు, కాబోయే భర్తలకు కూడా ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు చూపించాం. డైరెక్టర్ గారు మొత్తం కథ చెప్పిన తర్వాత ఏ క్యారెక్టర్ చేస్తావని అడిగారు.. మరో మాట లేకుండా మానస చిట్టి అనే క్యారెక్టర్‌కు ఓకే చెప్పేశానని ఆషికా రంగనాథ్ తెలిపారు.

ఈ క్యారెక్టర్ నేను చాలా ఎంజాయ్ చేశా. హీరోతో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి.. మాస్ ఫైట్ సీన్స్ ఉంటాయి. మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి నా క్యారెక్టర్‌కు స్కోప్ ఉంది. రవితేజ సార్‌ని ఏడిపించే క్యారెక్టర్ నాది. పంచ్, ఫన్, హ్యూమర్ క్రియేట్ చేయడం ఏ నటుడికైనా చాలా కష్టం. ఈ సినిమాలో రవితేజ గారు స్టార్‌లా కాకుండా ఒక యాక్టర్‌లా కనిపించారు. రవితేజ సార్ సీరియల్స్, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు, సపోర్టింగ్ రోల్స్ చేసి ఇలాంటి స్టార్ అయ్యారు. ఆయన జర్నీ గురించి సెట్‌లో అందరికీ చెప్పేవారు. ఎక్కడి నుంచి వచ్చాను అనే దానిని గౌరవిస్తారు అని ఆషికా వెల్లడించారు.

కళ్యాణ్ రామ్ గారు ప్రైవేట్ పర్సన్. ఫ్యామిలీ గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. సెట్‌లో పని అవ్వగానే ఇంటికి వెళ్లిపోవాలి అన్నట్లుగా ఉంటారు. నాగార్జున సార్.. ఛార్మింగ్. అంత పెద్ద సూపర్‌స్టార్ అయ్యుండి కూడా చిన్న నటుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆయనకు అంత అవసరం ఏంటీ. రవితేజ సార్.. ఏ విషయాన్ని అయినా సీరియస్‌గా తీసుకోరు. సెట్‌లో ఆయనుంటే ఆ సందడే వేరు. లైఫ్‌ చాలా ఈజీగా తీసుకుంటారు.. ఆయనను చూస్తే నేను కూడా అలాగే ఉండాలని అనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి గారు చాలా సాధారణ స్థాయి నుంచి వచ్చి ఈ స్థాయికి చేరుకున్నారు అని ఆషికా వెల్లడించారు.

మీకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని యాంకర్ ప్రశ్నించగా.. చాలా క్వాలిటీస్ ఉండాలి, నన్ను గౌరవించాలి. నేను నటిని, నటన నా ఫ్యాషన్ కాబట్టి ఆ కెరీర్ కొనసాగించేలా ప్రోత్సహించాలి. కేరింగ్‌గా, లవింగ్‌గా చూసుకోవాలి. నాకు లైట్‌గా ఓసీడీ ఉంది.. పరిశుభ్రతకు ప్రాణమిస్తా. ఈ విషయంలో అస్సలు రాజీపడనని ఆషికా పేర్కొన్నారు. ఇక నేను పనిచేసిన హీరోలలో నందమూరి కళ్యాణ్ రామ్ గారు పర్ఫెక్ట్ హాజ్బెండ్ మెటీరియల్. మాట్లాడే సమయాల్లో తన భార్య స్వాతిగారి గురించి పదే పదే చెబుతారు. భర్తగా కళ్యాణ్‌రామ్‌ గారిలో ఉన్న క్వాలిటీస్ ఉండాలి అని ఆషికా రంగనాథ్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X