వింటర్‌లో హీటెక్కిస్తున్న ఆషికా .. నా సామి రంగా అనేలా అందాల వడ్డింపు
తెలుగు చిత్ర పరిశ్రమలో కన్నడ భామల డామినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఎందరో కన్నడ అమ్మాయిలు తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌లుగా తెలుగు తెరను ఏలారు. ప్రస్తుత తరంలో అనుష్క శెట్టి, రష్మిక మందన్న, కృతి శెట్టి , పూజా హెగ్డే, శ్రీలీల వంటి కన్నడ కస్తూరిలు టాలీవుడ్‌లో తమ హవా చూపెడుతున్నారు. వీరి బాటలోనే తెలుగు నాట స్టార్ డమ్ కోసం ప్రయత్నిస్తున్నారు ఆషికా రంగనాథ్.
5 ఏప్రిల్ 1996న కర్ణాటకలోని తుముకూరులో జన్మించారు ఆషికా రంగనాథ్. తల్లిదండ్రులు రంగనాథ్, సుధ ఈమెకు ఓ అక్క అనూష రంగనాథ్ ఉన్నారు. ఈమె కూడా కన్నడ లీడింగ్ నటిగా దూసుకెళ్తున్నారు. తుముకూరు, బెంగళూరులలో చదువుకున్నారు. జ్యోతి నివాస్ కాలేజీలో చదువుకుంటున్న సమయంలో క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగళూరు కాంటెస్ట్ ఆడిషన్స్‌లో పాల్గొని రన్నరప్‌గా నిలిచారు. కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆషికా రంగనాథ్.. ఫ్రీ స్టైల్, బెల్లి, వెస్ట్రన్ డ్యాన్స్‌లో ప్రావీణ్యురాలు.

2016లో క్రేజీ బాయ్ అనే కన్నడ చిత్రం ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన ఆషికా రంగనాథ్ అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. మాస్ లీడర్, రాంబో 2, మదగజ, జేమ్స్, అవతార పురుష, గరుడ వంటి కన్నడ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2023లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన అమిగోస్ సినిమాతో తెలుగు వారిని పలకరించారు ఆషికా రంగనాథ్. ఈ మూవీలో ఆమె అందానికి , క్యూట్ లుక్స్‌కు మంచి మార్కులు పడ్డాయి.
ఆ వెంటనే టాలీవుడ్ అగ్ర కథనాయకుడు అక్కినేని నాగార్జున సరసన నటించే ఛాన్స్ కొట్టేశారు ఆషికా రంగనాథ్. ఈ సినిమా మంచి విజయం అందుకున్నా ఆమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. దీంతో మాతృభాష కన్నడంపైనే ఫోకస్ పెట్టారు ఆషిక. అటు తమిళంలోనూ మిస్ యూ, సర్దార్ 2 చిత్రాల్లో నటించి కోలీవుడ్‌ను సైతం కవర్ చేశారు. ఈ క్రమంలో మరోసారి ఆషికకు తెలుగు నుంచి కబురు అందింది. అది కూడా అలాంటి ఇలాంటి ఆఫర్ కాదు. ఏకంగా మెగాస్టార్ సరసన.
బింబిసార ఫేం వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న విశ్వంభరలో ఆమెకు అవకాశం దక్కింది. ఇందులో మీనాక్షి చౌదరి, త్రిష, ఇషా చావ్లాలతో ఆషిక స్క్రీన్ చేసుకోనున్నారు. ఆల్ మోస్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న విశ్వంభరను సంక్రాంతి కానుకగా జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో విశ్వంభరను తెరకెక్కిస్తున్నారు.
ఇటీవల సిద్ధార్థ్ సరసన నటించిన మిస్ యూ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇందులో ఆషికా రంగనాథ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక చీరలోనూ, మోడ్రన్ డ్రెస్‌లోనూ ఆమె చూడచక్కగా ఉంటారు. అయితే తొలినాళ్లలోనే సీనియర్ హీరోల పక్కన చేయడంతో యంగ్ హీరోల ఛాన్స్‌లు కోల్పోయారనే వాదనలు కూడా ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆషికా రంగనాథ్.. తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. తాజాగా పలుచటి శారీ కట్టి అందాలను ఆరబోస్తూ ఆషికా చేసిన ఫోటో షూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఇంకేందుకు ఆలస్యం మీరూ ఆషికా అందాలను చూసేయండి.


Click it and Unblock the Notifications











