Ashika Ranganath: అషికా రంగనాథ్ అందాల జోరు.. భర్త మహాశయులకు విజప్తిలో గ్లామర్ విందు ట్రెండింగ్!
సినిమా పరిశ్రమలోకి అందాల భామలు వస్తూనే ఉంటారు. తమకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకొంటూ స్టార్స్‌గా మారిపోతారు. కొందరు గ్లామర్‌తో ప్రేక్షకులను మెప్పిస్తే.. మరికొందరు తమ ఫెర్ఫార్మెన్స్‌తో మెస్మరైజ్ చేస్తారు. అలాంటి తారలు ఇప్పటి వరకు ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో చెరుగని ముద్ర వేశారు. అలాంటి కోవలోనే ప్రస్తుతం ఆషికా రంగనాథ్ అనే కన్నడ భామ తనకంటూ భారీగా అభిమానులను సంపాదించుకొన్నారు. ఇటీవల ఆమె నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలో గ్లామర్‌తోనే కాకుండా పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ఆకట్టుకొన్నారు. ప్రస్తుతం ఆషికా రంగనాథ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
కర్ణాటకలో జన్మించిన ఈ అందాల భామ కన్నడ సినీ పరిశ్రమలో నటిగా రాణిస్తున్నారు. బెంగళూరులో నిర్వహించిన పలు అందాల పోటీల్లో విజేతగా నిలిచిన ఈ గ్లామర్ డాల్ మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సినిమాల్లో ఆఫర్లు రావడంతో హీరోయిన్‌గా మారింది. కేవలం ఆమె కన్నడకే పరిమితం కాకుండా దక్షిణాదిలో పలువురు హీరోల సరసన నటించి మెప్పించింది. అనతికాలంలోనే శివరాజ్ కుమార్, గణేష్, నాగార్జున అక్కినేని సరసన నటించే అవకాశాన్ని దక్కించుకొన్నది.

కన్నడలో క్రేజీ బాయ్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆషికా రంగనాథ్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. మాస్ లీడర్, ముగులు నాగే, రాంబో, రాజు కన్నడ మీడియం, గరుడ, మధగజ, గత వైభవ సినిమాల్లో నటించింది. తెలుగులో కల్యాణ్ రామ్‌త అమిగోస్, నాగార్జునతో కలిసి నా సామిరంగ నటించింది. చిరంజీవితో విశ్వంభర చిత్రంలో నటిస్తున్నది. తాజాగా ఆమె నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజైంది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రంలో సంపన్న కుటుంబంలో జన్మించిన టాప్ బిజినెస్ ఉమెన్ పాత్రలో నటించింది. ఈ చిత్రంలో ఆమె పొట్టి దుస్తుల్లో సందడి చేసింది. గ్లామర్ పంటను భారీగా పండించింది. అయితే ఆమె డ్రస్పులు మాడరన్‌గా ఉన్నప్పటికీ.. ఎక్కడా అసభ్యత, అశ్లీలత కనిపించకుండా జాగ్రత్త పడింది. తన అందాల జాతరను తెరపైన కొనసాగించింది. కేవలం ఆమె గ్లామర్‌కే పరిమితమైనందంటే తప్పులో కాలేసినట్టే.. పెర్ఫార్మెన్స్ పరంగా కూడా రవితేజ, డింపుల్ హయతితో పోటీ పడి నటించింది.
ఇక భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో లభించిన రెస్పాన్స్, ఆడియెన్స్ హృదయాల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకొన్నది. ఈ సినిమాతో భారీగా అభిమానులను, ఫాలోవర్స్‌ను పెంచుకొన్నదనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే ఈ మూవీ తర్వాత ఆమెను భారీగా ఆఫర్లు తలుపుతడుతున్నాయి. అగ్ర హీరోల సరసన నటించే అవకాశాలు వెంటాడుతున్నట్టు సమాచారం. తెలుగు సినిమా రంగంలోనే కాకుండా దక్షిణాదిలో మరో గ్లామర్ తార విజృంభించడానికి సిద్దమవుతున్నది. ఆమెకు ఆఫర్లే కాకుండా భారీగా రెమ్యురేషన్ కూడా ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











