ఎంజాయ్ చేయండి అంటూ మినీ స్కర్ట్ తో రోడ్డెక్కిన హీరోయిన్.. ఎక్కడా తగ్గట్లేదుగా !
తెలుగులో నాటకం అనే సినిమాతో పరిచయమైన అషిమా నర్వాల్ మొదటి సినిమాతోనే మంచి నటిగా పేరు తెచ్చుకుంది. అయితే ఆమె తెలుగులో ఒకరి రెండు సినిమాలు చేసినా పెద్దగా అవకాశాలు దక్కలేదు. దీంతో ప్రస్తుతం ఈ భామ గ్లామర్ షోకి తెరలేపింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో సూపర్ వైరల్ గా మారాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

ఆస్ట్రేలియా సిటిజెన్
హర్యానాలోని రోహ్తక్ లో జన్మించిన అషిమా నర్వాల్ పెరిగింది మాత్రం ఆస్ట్రేలియాలో. జాట్ కుటుంబానికి చెందిన ఆమె కుటుంబం మొత్తానికి ఆస్ట్రేలియా పౌరసత్వం ఉంది. సిడ్నీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో నర్సింగ్ చేసి, కొంతకాలం అక్కడే పని చేసింది. అయితే ఫ్యాషన్ రంగం మీద ఉన్న మక్కువతో మోడల్ గా మారిన ఈ భామ ఒకే సంవత్సరంలో రెండు వేర్వేరు అందాల పోటీల్లో పాల్గొని విజయం సాధించింది.

నర్సింగ్ to యాక్టింగ్
అలా 'మిస్ సిడ్నీ ఆస్ట్రేలియా ఎలిగెన్స్ 2015', 'మిస్ గ్లోబల్ 2015' టైటిల్స్ గెలిచింది. ఇక అలా ఇండియా చేరిన ఈ భామ 2018లో నాటకం అనే సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ మొదటి సినిమా సరిగ్గా ఆడలేదు. ఆ తర్వాత ఆమె చేసిన జెస్సీ అనే మరో హారర్ సినిమా కూడా ఆమెకు పెద్దగా పేరు తీసుకురాలేదు. కానీ ఆ తర్వాత విజయ్ ఆంటోనితో కలిసి చేసిన తమిళ సినిమా మాత్రం బాగానే ఆడింది.

కిల్లర్
ఆ సినిమాని తెలుగులో కిల్లర్ అనే పేరుతో డబ్బింగ్ చేశారు. ఆ సినిమా ఇక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత 'రాజ భీమ' తమిళ సినిమా చేయగా అది రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ గత సంవత్సరం సిగరెట్ తాగుతూ ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వివాదాస్పదంగా మారడంతో, ఒక సినిమా కోసం చేసిన వీడియో అని ఆమె తర్వాత క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ఎంజాయ్ అంటూ
అయితే తాజాగా ఈ భామ వరుసగా ఫోటోషూట్లు షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది. హ్యాపీ అంటూ సింబల్ ఉన్న ఒక నల్లటి టాప్ ధరించిన ఈ భామ మినీ స్కర్ట్ తో రోడ్డెక్కి ఫోజులిచ్చింది. మళ్ళీ తెల్లటి టాప్ లో కనిపించిన ఈ భామ ఎంజాయ్ ది జర్నీ అంటూ మరో పోస్ట్ చేసి అందరిలో ఆసక్తిగా రేపుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

సినిమాల విషయానికి వస్తే
ఇక ప్రస్తుతం ఈ భామ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే 'రాజ భీమ' తమిళ సినిమా చేయగా అది పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో ఆర్‌ఎస్‌వీపీ మూవీస్, ఫ్లైయింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ నిర్మించిన 'పిట్ట కథలు'లో కూడా ఆమె నటించింది. అందులో ఆమె పాత్రకు గాను మంచి పేరు తెచ్చుకుంది ఈ భామ.


Click it and Unblock the Notifications











