పవన్ కల్యాణ్ బర్త్ డే.. ఆ మెమొరీని షేర్ చేసిన అషురెడ్డి ఇన్స్‌టాలో ట్రెండింగ్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా తమ అభిమానులు శుభాకాంక్షలు, విషెస్‌తో సోషల్ మీడియాను రఫ్ ఆడిస్తున్నారు. తమ సందేశాలతో ఆయనపై ఉన్న ప్రేమానురాగాలను కురిపిస్తున్నారు. జనసేనాని బర్త్ డేను పురస్కరించుకొని వారితో అనుబంధాన్నిఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేసి తమ అభిమానాన్ని చాటుకొంటున్నారు. అయితే తాజాగా యాక్టర్, బిగ్‌బాస్ బ్యూటీ అషురెడ్డి విషెస్ ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ఈ పోస్టు వివరాల్లోకి వెళితే..
తెలుగు సినిమా రంగంలో పవన్ కల్యాణ్‌కు ప్రేక్షకులే కాకుండా హీరోలు, హీరోయిన్లు కూడా ఫ్యాన్స్‌గా ఉన్నారు. అందులో యంగ్ యాక్ట్రెస్ అషురెడ్డి కూడా ఒకరు. తన అభిమానం ఎంతంటే? తన బాడీపై కనిపించి కనిపించని చోట టాటూ వేసుకొన్నంత కొండంత ప్రేమ. అలాంటి యువ నటి పవన్ కల్యాణ్ బర్త్ డే వస్తే సాధారణంగా విషెస్ చేబుతారనుకొంటే పొరపాటే..

సెప్టెంబర్ 2వ తేదీన పవన్ జన్మదినం కావడంతో ఆమె తన అభిమాన హీరోకు వినూత్నంగా శుభాకాంక్షలు అందించాలని భావించింది. గతంలో తనకు ఆటోగ్రాఫ్ రూపంలో శుభాకాంక్షలు అందించిన ఓ పేపర్‌ను ఫోటో తీసి ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం పవన్ రాసిన చేతిరాత ఫ్యాన్స్‌లో క్రేజీగా మారింది.
పవన్ కల్యాణ్ నుంచి అషురెడ్డి తీసుకొన్న ఆటోగ్రాఫ్‌లో అశ్విని (అషు) గారికి.. మీరు కోరుకొన్నవన్నీ మీ జీవితంలో జరగాలని కోరుకొంటున్నాను అంటూ ఇట్లూ పవన్ కల్యాణ్ అని స్యయంగా పవర్ స్టార్ రాసిన అక్షరాలు ఉన్న కాగితాన్ని పోస్టు చేసింది. అషురెడ్డి చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతున్నది.
ఈ సందర్భంగా అషురెడ్డి బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రపంచంలో మానవత్వానికి నిలువుటద్దంలాల నిలిచిన పవన్ కల్యాణ్‌కు హ్యాపీ బర్త్ డే అని మెసేజ్ పంపారు. అయితే ఆమె పోస్టుపై అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. అషురెడ్డి పోస్టు మాత్రం అందర్నీ ఆకట్టుకొంటున్నది.


Click it and Unblock the Notifications











