రౌడీ హీరోకి అషు రెడ్డి వీడియో కాల్.. అంతా సస్పెన్స్.. ఏమై ఉంటుందబ్బా?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసింది కొన్ని సినిమాలే అయినా యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుని పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అయితే ఆయనతో బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి వీడియో కాల్ మాట్లాడినట్లుగా స్టేటస్ షేర్ చేసి అందరిలో ఆసక్తి పెంచేసింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

యూత్ లో విపరీతమైన క్రేజ్

యూత్ లో విపరీతమైన క్రేజ్

నువ్విలా అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు అనే సినిమాతో హీరోగా మారారు. చేసిన మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ తర్వాత చేసిన అర్జున్ రెడ్డి అనే సినిమాతో ట్రెండ్ సెట్టింగ్ హీరోగా మారిపోయి టాలీవుడ్ మొత్తానికి రౌడీ హీరో అనిపించుకున్నాడు. ఆ తర్వాత ఆయన చేసిన గీతగోవిందం, టాక్సీవాలా సినిమాలు కూడా సూపర్ హిట్స్ కావడంతో ఆయనకు యూత్ లో విపరీతమైన క్రేజ్ లభించింది.

జనగణమన

జనగణమన

అయితే ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విఫలమయ్యాయి కానీ ఆయన క్రేజ్ మాత్రం అంతకు అంతకు పెరుగుతూ వెళ్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరీ జగన్నాధ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా పూర్తి చేశాడు. ఆ సినిమా ఆగస్టు 25వ తేదీన విడుదల కావాల్సి ఉండగా ఇప్పుడు మరో సినిమా కూడా పట్టాలెక్కించాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఆ సినిమా పూర్తయిన వెంటనే విజయ్ దేవరకొండతో మళ్ళీ పూరి జగన్నాథ్ తో మళ్ళీ ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పేరు జనగణమన.

జూనియర్ సమంత అని

జూనియర్ సమంత అని

ఇక ఈ రెండు సినిమాలు కూడా ఉండగానే ఆయన పూరీ జగన్నాథ్ తో మూడో సినిమా కూడా ఒప్పుకున్నాడు అనే ప్రచారం జరుగుతుంది. కానీ ఆ విషయం మీద సరైన క్లారిటీ లేదు. అయితే అసలు విషయం ఏమిటంటే తాజాగా ఆయన అషు రెడ్డితో వీడియో కాల్ మాట్లాడినట్లుగా ఉన్న ఒక స్క్రీన్ షాట్ ఆమె తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. జూనియర్ సమంత అని పేరు తెచ్చుకున్న అషు రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది.

స్క్రీన్ షాట్ తీసి

స్క్రీన్ షాట్ తీసి

బిగ్ బాస్ షోలో రెండు సార్లు పాల్గొని బయటకు వచ్చిన ఈ భామ అడపాదడపా కొన్ని షోస్ లో కనిపిస్తూ ఉండేది. అలాగే రాహుల్ సిప్లిగంజ్, ఎక్స్ప్రెస్ హరి వంటి వారితో ప్రేమాయణం ఉందేమో అని అనుమానం కలిగించే విధంగా పోస్టులు పెడుతూ ఉండే ఈ భామ తాజాగా తాను విజయ్ దేవరకొండతో వీడియో కాల్ మాట్లాడుతున్నప్పటి స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

దేవరకొండ తో వీడియో కాల్

దేవరకొండ తో వీడియో కాల్


అసలు అది నిజమో లేక ఫోటోషాప్ చేసిందో తెలియదు కానీ ఆమె విజయ్ దేవరకొండ తో వీడియో కాల్ మాట్లాడడం ఏమిటా అని అటు విజయ్ ఫ్యాన్స్ సహా అషు రెడ్డి ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించి ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలని వారు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు పెడుతున్నారు. మరి చూడాలి ఆమె ఈ విషయం మీద క్లారిటీ ఇస్తుందో లేదో అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X