వైరల్ అవుతున్న అసిన్ ముద్దుల కుమార్తె ఫోటో!
హీరోయిన్ అసిన్ సౌత్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఆసిన్ పేరు చెప్పగానే గజినీ, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, లక్ష్మి నరసింహా, ఘర్షణ లాంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. కొన్ని బాలీవుడ్ చిత్రాలలో కూడా అసిన్ నటించింది. కెరీర్ ఫుల్ జోష్ లో సాగుతున్న సమయంలోనే అసిన్ ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్ శర్మని వివాహం చేసుకుని సెటిల్ అయింది. వివాహం తర్వాత అసిన్ పూర్తిగా సినిమాలకు దూరమైంది. ఈ జంటకు ఓ పాప కూడా పుట్టింది.
గత ఏడాది అసిన్, రాహుల్ శర్మ తమ కుమార్తె తొలి పుట్టినరోజు వేడుకని ఘనంగా నిర్వహించారు. అసిన్ ముద్దుల కుమార్తె అరిన్ తన క్యూట్ లుక్స్ తో నెటిజన్లని ఆకర్షించింది. తాజాగా అసిన్ ఇంస్టాగ్రామ్లో షేర్ చేసిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. తమ పాపకు 18 నెలలు నిండాయని అసిన్ పేర్కొంది. అసిన్ కుమార్తె పింక్ కలర్ గౌనులో చూడ ముచ్చటగా ఉంది.

అసిన్ భర్త రాహుల్ శర్మ మైక్రోమాక్స్ సంస్థకు కో ఓనర్ గా ఉన్నారు. అసిన్ సినిమాలకు దూరమైన దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. గజినీ, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి లాంటి చిత్రాల్లో ఆసిన్ నటన మరచిపోలేని విధంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications











