6 ఏళ్లు వేశ్యగా.. 25 లక్షలు చెల్లించి రెడ్ లైట్ ఏరియా నుంచి.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్ ఆవేదన
ఆధునిక యుగంలో సోషల్ మీడియా ఎంతటి ప్రాధాన్యత పోషిస్తుందో తెలిసిందే. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లోనే వైరల్ అవుతోంది. తద్వారా జనాల్లోకి కొంత మేర వాస్తవాలు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదోక సమాచారం ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా అర్చిత ఫుకన్ అలియా బేబీడాల్ అర్చి పేరు ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఆమె 6 ఏళ్లపాటు వేశ్యగా పనిచేసి ఎంతో నరకం చూసిందంట.. అందులో నుంచి తాజాగా విముక్తి పొందింది. అందుకు లక్షల్లో డబ్బు చెల్లించిందంట.. అంతే కాదు 8 మంది అమ్మాయిలను కూడా రక్షించింది.. ఆ వివరాల్లోకి వెళితే..
అర్చితా ఫుకాన్ ఎవరు?
ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగుతున్న అర్చితా ఫుకాన్ అస్సాం కు చెందింది. అమె పేరు సోషల్ మీడియా అకౌంట్ ద్వారా జనాల్లో ఫేమస్ అయ్యింది. ఆమెకు ఇన్ స్టా గ్రామ్ లో 8 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉండటం విశేషం. ఇక ఎక్స్ లో ఆమెను 21 వెయ్యి మంది ఫాలో అవుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో తరుచుగా తన రీల్స్ ద్వారా ఆకట్టుకుంటూ ఉండేది. ఎక్కువగా దుస్తులు, ఫ్యాషన్ కు సంబంధించిన వీడియోలను పంచుకుంటూ వచ్చింది. దాంతో ఆమె ఇన్ ఫ్ల్యూయెన్సర్ గా మారింది.

5 రోజులుగా ట్రెండింగ్ లోనే..
అయితే గత ఐదు రోజలుగా అర్చితా ఫుకాన్ ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి. ఎంతో మంది ఇన్ ఫ్లూయెన్సర్లు ఉన్నా ఈమెనే ఎందుకు ట్రెండింగ్ లోకి వచ్చిందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఆమె వయోజన తారతో కలిసి ఒక చిత్రాన్ని తన ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ లో పంచుకుంది. ఇకపై ఆమెతో కలిసి పనిచేయబోతున్నాననే సమాచారాన్ని పరోక్షంగా అందించింది. దాంతో ఆమె పోర్న్ స్టార్ గా మారబోతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
25 లక్షలతో విముక్తి..
అసలు అర్చితా ఫుకాన్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి రావడానికి అసలు కారణం ఆమె హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి తప్పించుకోవడమే. ఆమె 6 ఏళ్లుగా అస్సాంలోని ట్రంక్ రోడ్డులోని రెడ్ లైట్ ఏరియాలో 6 ఏళ్లుగా పనిచేసిందంట. ఇటీవలనే 25 లక్షలు చెల్లించి వారి నుంచి స్వాతంత్రం పొందిందంట. అంతే కాదు తనతో పాటు 8 మంది అమ్మాయిలకు సాయం చేసి వార్తాల్లో నిలిచిందని ఎక్స్ లో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించినందుకు అందురు అభినందిస్తున్నారు.
స్పందించిన బేబీడాల్ ఆర్చి..
తాజాగా బేబీడాల్ ఆర్చి సోషల్ మీడియా వేదిక స్పందించింది. తన పేరు ప్రచారంలోకి రావడం చూశానని తెలిపింది. చాలా వార్తాలు, గుసగుసలు, ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికి కారణం ఒక ఫ్రేమ్, ఒక క్షణం కారణంగానే. దాని గురించి నేను స్పష్టంగా చెప్పాలి, నేను వైరల్ అవుతున్న వార్తలను నిర్ధారించలేదు. నేను దానిని తిరస్కరిస్తున్నానని చెప్పింది. అయితే అన్నీ మాటల్లోనే చెప్పలేమని, అధ్యాయనం ద్వారా నేర్చుకుంటామని ఆసక్తికరంగా స్పందించింది.


Click it and Unblock the Notifications











