ఈ ఏడాదే ఆ హీరోయిన్ పెళ్లి.. వైవాహిక జీవితం అలా.. ప్రముఖ జ్యోతిష్యుడి షాకింగ్ కామెంట్స్
సినీనటుల పెళ్లిళ్లు, ఎఫైర్స్, బ్రేకప్స్ గురించి ప్రతినిత్యం సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. వీటిలో కొన్ని మాత్రమే వాస్తవాలు కాగా.. మిగిలినవి రూమర్స్. ప్రజలు, దేశ కాల పరిస్ధితులపై జోస్యాలు చెప్పే కొందరు జ్యోతిష్యులు కూడా సినీతారల జీవితాలపై ప్రిడిక్షన్స్ చెబుతూ పాపులర్ అవుతున్నారు. తెలుగునాట వేణుస్వామి వంటి జ్యోతిష్యులు.. సెలబ్రెటీల జాతకాలు చెబుతూ పాపులర్ అయ్యారు. మధ్యలో కొన్ని జోస్యాలు రివర్స్ కావడంతో వేణుస్వామి హవా కాస్త తగ్గినప్పటికీ ఆయన క్రేజ్ అలాగే ఉంది. మన వేణుస్వామి మాదిరిగానే బాలీవుడ్‌లోనూ సుశీల్ కుమార్ అనే జ్యోతిష్యుడు.. సెలబ్రెటీల జాతకాలు పరిశీలించి జోస్యాలు చెబుతుంటారు. తాజాగా ఆయన ఓ హీరోయిన్ గురించి చెప్పిన ప్రిడిక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ నటి ఎవరు? ఆమె గురించి ఆ జ్యోతిష్యుడు ఏం చెప్పాడో పరిశీలిస్తే..
జాన్వీని హీరోయిన్‌గా చూడకుండానే శ్రీదేవి మృతి
ఆ హీరోయిన్ ఎవరో కాదు.. అతిలోక సుందరి, దిగ్గజ నటి దివంగత శ్రీదేవి , నిర్మాత బోనీ కపూర్ దంపతుల పెద్ద కుమార్తె జాన్వీ కపూర్. బలమైన సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా జాన్వీ హీరోయిన్‌గా స్థిరపడటానికి ఎంతో కష్టపడ్డారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న లీ స్ట్రాస్‌బెర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకున్నారు జాన్వీ కపూర్. బతికున్న రోజుల్లోనే జాన్వీ కెరీర్ కోసం శ్రీదేవి కట్టుదిట్టంగా ప్లాన్ చేశారు. కానీ తన కూతురిని తెరపై చూడకుండానే ఆమె తిరిగిరాని లోకాలకు తరలిపోయారు.

చరణ్, అల్లు అర్జున్ చిత్రాల్లో జాన్వీ
2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లో శ్రీదేవి కన్నుమూశారు. అప్పటికి జాన్వీ తొలి చిత్రం ధడక్ చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా పూర్తి కాలేదు. కరణ్ జోహార్ నిర్మాతగా శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018 జూలై 20న విడుదలై హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ఘోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సెనా : ది కార్గిల్ గర్ల్, రూహి, గుడ్ లక్ జెర్రీ, మిలి, బవాల్, రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ, మిస్టర్ అండ్ మిసెస్ మహి, ఉల్జా వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌లలో ఒకరిగా నిలిచి తల్లి కలను నిజం చేశారు. జాన్వీతో దక్షిణాది చిత్రాల్లోనూ నటింపజేయాలని శ్రీదేవి అనుకున్నారు. జాన్వీ ఆ కలను కూడా నిజం చేశారు. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్దిలో, హిందీలో సన్నీ సంస్కారీ కీ తులసి కుమారిలోనూ నటిస్తున్నారు జాన్వీ.
శిఖర్ పహారియాతో జాన్వీ డేటింగ్
30కి దగ్గరవుతున్నా ఇంకా పెళ్లి మాట ఎత్తడం లేదు జాన్వీ కపూర్. అయితే ఆమె శిఖర్ పహారియా అనే వ్యక్తితో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అనంత్ అంబానీ పెళ్లితో పాటు పలు బాలీవుడ్ ఈవెంట్స్‌లోనూ శిఖర్‌తో కలిసి జాన్వీ కనిపించారు. ఇరు కుటుంబాల్లోనూ వీరి ప్రేమను అంగీకరించడంతో త్వరలోనే వీరి పెళ్లి జరుగుతుందని టాక్. ఈ శిఖర్ ఎవరో కాదు.. మాజీ కేంద్ర మంత్రి, మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. ఈతని తండ్రి వ్యాపారవేత్త.
ఈ ఏడాదే జాన్వీ పెళ్లి?
తాజాగా సిద్ధార్ధ్ కన్నన్ అనే యూట్యూబ్ ఛానెల్‌తో సుశీల్ కుమార్ అనే జ్యోతిష్యుడు మాట్లాడుతూ.. జాన్వీ ఈ ఏడాదే పెళ్లి చేసుకుంటుందని, 2026 ఆమె జీవితంలోనే అత్యుత్తమ సంవత్సరమని పేర్కొన్నాడు. ఇప్పుడు పెళ్లి మిస్సయితే 33వ ఏట ఆమెకు పెళ్లి జరుగుతుందని జోస్యం చెప్పాడు. అలాగే జాన్వీ కపూర్ వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగుతుందని, కాకపతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని సుశీల్ పేర్కొన్నాడు. ప్రస్తుతం అతని వ్యాఖ్యలు బాలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి. మరి సుశీల్ చెప్పినట్లుగా జాన్వీ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారా? లేదా అన్నది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











