హీరోయిన్‌ బురిడీ కొట్టించిన జ్యోతిష్కుడు.. జాతకం పేరుతో అనన్యను అలా వాడేసాడేంటి

ప్రస్తుతం నార్త్ సినిమా మార్కెట్ నుంచి చాలా మంది హీరోయిన్ సౌత్ సినిమాకి ముఖ్యంగా మన తెలుగు సినిమా వైపు వచ్చేందుకు మొగ్గు చూపిస్తున్న సంగతి విధితమే.. కాగా ప్రస్తుతం జాన్వీ కపూర్ ఆల్రెడీ సెన్సేషనల్ హిట్ దేవర తో తెలుగులో పాగా కూడా వేసేసింది. సరే ఇది బాగానే ఉంది కానీ తన తర్వాత ఆలియా భట్ కూడా తెలుగు మార్కెట్ ని సీరియస్ గా తీసుకుంది.

అయితే గతంలో కూడా చాలా మంది బాలీవుడ్ బ్యూటీస్ తెలుగు సినిమాలో చేశారు కానీ వారంతా ఇక్కడ సరిగ్గా క్లిక్ అవ్వక మళ్ళీ బాలీవుడ్ లోకే వెళ్లిపోయారు. అయితే అలాంటి కొంతమంది హీరోయిన్స్ లో లైగర్ బ్యూటీ అనన్య పాండే కూడా ఒకరు. మరి సెన్సేషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో దర్శకుడు పూరి జగన్నాథ్ చేసిన సినిమా లైగర్ తో అనన్య పాండే మొదటిసారిగా తెలుగు సినిమా ఆడియెన్స్ కి పలకరించింది.

Astrologer uses ananya panday name for religious sake video viral

అయితే ఈ సినిమా అనుకున్న రేంజ్ లో రాణించలేక భారీ డిజాస్టర్ అయ్యింది. దీనితో అనన్యకి తెలుగులో మంచి ఆరంభం దొరక్కపోయేసరికి మళ్ళీ హిందీలోకి వెళ్ళిపోయింది. ఇక అక్కడ పలు సినిమాలు వెబ్ సిరీస్ లను ఆమె చేస్తుండగా ఆ మధ్య పలువురు క్రికెటర్స్ తో డేటింగ్ లో కూడా ఉన్నట్టుగా పలు షాకింగ్ రూమర్స్ వచ్చాయి.

అయితే ఇవన్నీ పక్కన పెడితే అనన్య పేరు నార్త్ ఆడియెన్స్ సోషల్ మీడియాలో మరో రకంగా వైరల్ గా మారింది. కాగా అనన్యపై ఓ వీడియో వైరల్ గా మారింది. కాగా అనన్య ఓ ఈవెంట్ కి హాజరు కాగా అందులో ఆమెతో ఓ పాస్టర్ కన్వర్జేషన్ చేయడం జరిగింది. అందులో ఆమెకి అతను నువ్(అనన్య) ని ఫ్యూచర్ లో 60 కోట్లు విలువ చేసే ప్రాజెక్ట్ ని పడతావు అంటూ జోస్యం చెప్పాడు.

అలాగే ఆమెతో పాటుగా మరో యువ నటుడు కూడా ఉన్నాడు అతడికి 2026 కి పెద్ద స్టార్ వి అవుతావు అంటూ అందరి ముందు జోస్యం చెప్పాడు. కానీ ఈ వీడియో మరో రకంగా ప్రొజెక్ట్ అవుతుంది. ఆ పాస్టర్ అన్న మాటలకి అనన్య సహా నటుడు పొంగిపోయి ఉండొచ్చు కానీ అక్కడ వారిద్దరిని వాడుకొని అతను మత ప్రచారం చేసుకుంటున్నాడు అని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

దీనితో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా తిరుగుతుంది. కాగా అనన్య రీసెంట్ గా నటించిన సినిమా "సిటిఆర్ఎల్" పాపుల ఓటిటి యాప్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని అందుకోగా ఈ సినిమా కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈమె నటించిన ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ కూడా వచ్చింది. ఇవి కాకుండా ప్రస్తుతం అనన్య హిందీ పలు సినిమాలు చేస్తూ మార్కెట్ లోనే బిజీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X