వేణు స్వామితో ప్రభుదేవా హీరోయిన్ ప్రత్యేక పూజలు.. యంగ్ స్టార్ ఎవరంటే?
ఇటీవల జ్యోతిష్యం తప్పింది అంటూ దారుణంగా ట్రోలింగ్ కు గురైన వేణు స్వామి తాజాగా మరో హీరోయిన్ తో ప్రత్యేక పూజలు జరిపించి వార్తల్లో నిలిచారు. టాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్న ఓ అప్ కమింగ్ హీరోయిన్ వేణు స్వామితో పూజలు చేయించుకుని, ఆయన ఆశీర్వాదం అందుకుంది. మరి ఈ బ్యూటీ ఎవరో ఓ లుక్కేద్దాం పదండి.
మన దేశంలో జ్యోతిష్యం అంటే కొంతమందికి ఎంత నమ్మకం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా జ్యోతిష్యాన్ని నమ్మే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. అందులో పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో వేణు స్వామి సినీ సెలబ్రిటీలకు సంబంధించిన జ్యోతిష్యం చెబుతూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆయన జ్యోతిష్యం చెప్పడమే కాకుండా ప్రముఖుల ఇళ్లలో పూజలు, యాగాలు చేస్తూ మరింత పేరు తెచ్చుకున్నారు.

ఇప్పటికే రష్మిక మందన్నా, నిధి అగర్వాల్ లాంటి స్టార్ హీరోయిన్లు వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అలాగే పలువురు బుల్లితెర నటీమణులు కూడా ఆయనతో పూజలు చేయించుకుని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో కన్నడ యంగ్ హీరోయిన్ నిశ్విక నాయుడు కూడా చేరిపోయింది. నిశ్విక నాయుడు తాజాగా వేణు స్వామి చేసిన ప్రత్యేక యాగంలో పాల్గొంది.
దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ బ్యూటీ జాతకంలో దోషం ఉందేమోనని లేదా ఆమె ఐశ్వర్యం మరింత పెరగాలని వేణు స్వామితో తన ఇంట్లో ప్రత్యేక పూజలు చేసిందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. పూజా కార్యక్రమం అనంతరం వేణు స్వామి మాట్లాడుతూ టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న నిశ్విక ఇప్పటికే కన్నడ నటిగా మంచి పేరును దక్కించుకుందని చెప్పారు.

ప్రభుదేవాతో కలిసి సమానంగా డాన్స్ చేసిన ఈ బ్యూటీ త్వరలోనే తెలుగు తెరపై మెరవబోతుందని చెబుతూ, ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా నిశ్విత జాతకం చూశాను. టాలీవుడ్లో ఆమెకు మంచి పేరు రావాలి, సూపర్ స్టార్ గా ఎదిగే జాతకం ఆమెది. త్వరలోనే ఆమె సక్సెస్ కావాలని ప్రార్థిస్తున్నానని స్వామి తెలిపారు. నిష్విక మీ ఆశీస్సులు ఉంటే తప్పకుండా విజయం సాధిస్తానన్న నమ్మకం ఉంది అంటూ ఆయన కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదాలు అందుకుంది.
ఇక ఆ ఫొటోలను గమనిస్తే వేణు స్వామి ఎప్పటిలాగే తన పూజా విధానంలో ఆల్కాహాల్, మాంసం పెట్టి పూజ చేసినట్టు కన్పిస్తోంది. అయితే కొంతమంది నెటిజన్లు ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో మరోసారి జగన్ సీఎం అవుతాడని ఆయన చెప్పిన జోస్యం తప్పింది అనే విషయాన్ని గుర్తు చేస్తూ, నిశ్వికను మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు. 2018 లో వచ్చిన అమ్మ ఐ లవ్ యు సినిమాతో నిశ్విక శాండిల్ వుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కన్నడలో పలు సినిమాల్లో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపును దక్కించుకుంది. మరి తెలుగులో ఈ బ్యూటీ ఏ సినిమాలో నటిస్తోంది అన్న విషయం తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











