51 ఏళ్ల వయసులో తెగించేసిన వర్మ హీరోయిన్ .. నెక్ట్స్ లెవల్‌లో గ్లామర్ షో!

కొందరిని చూస్తే వారు అన్నం తింటున్నారా? అందం తింటున్నారా? అన్నట్లుగా ఉంటారు. రేఖ, హేమామాలిని వంటి వారు 70లు దాటేసినా ఇంకా చెక్కుచెదరని గ్లామర్‌తో మెరిసిపోతారు. క్రమశిక్షణ, ఆహారపు అలవాట్లు, వ్యాయామంతో వారు ఈ వయసులోనూ ఫిట్‌గా అందంగా ఉంటున్నారు. ఈ కోవలోకే వస్తారు సీనియర్ హీరోయిన్ ఊర్మిళ మటోండ్కర్. రంగీలాతో దేశాన్ని ఊపేసిన ఈ ముద్ధుగుమ్మ అప్పుడెలా ఉన్నారో ఇప్పటికీ అదే ఛార్మింగ్‌తో మెరిసిపోతున్నారు.

ఊర్మిళను స్టార్ హీరోయిన్‌ని చేసిన ఆర్జీవీ

ఖర్మ్ అనే హిందీ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఊర్మిళ బాలీవుడ్‌లో బిజీగా ఉన్న దశలో అంతం సినిమాతో తెలుగు వారిని పలకరించింది. రామ్ గోపాల్ వర్మ కళ్లలో పడటం ఈమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన అనగనగా ఒకరోజు, రంగీలా, సత్య చిత్రాలు .. ఊర్మిళను టాప్ హీరోయిన్‌గా నిలబెట్టాయి. సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచారు ఊర్మిళ. తన కంటే వయసులో 10 ఏళ్ల వ్యక్తిని పెళ్లాడి అప్పట్లో బాలీవుడ్‌ను షేక్ చేశారు. ఆయనే మోడల్ మోసిన్ అక్తార్.. గతేడాది వీరిద్దరూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లుగా వార్తలు రావడంతో బీటౌన్ ఉలిక్కిపడింది.

At 51 Urmila Matondkar redefines glamour in a designer Saree her latest photos here

వివాహం కావడంతో ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ సినిమాలకు దూరమయ్యారు ఊర్మిల. చివరిగా 2018లో బ్లాక్ మెయిల్ అనే సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. 45 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తగ్గకుండా ఆమె చేసిన యూత్‌ని ఊపేసింది. ఇక తనకు జీవితాన్ని ఇచ్చిన గురువు రామ్ గోపాల్ వర్మతోనూ ఊర్మిళకు పడటం లేదని మొన్నామధ్య గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఇవి హద్దులు దాటడంతో సత్య మూవీ రీ రిలీజ్ ఈవెంట్‌లో క్లారిటీ ఇచ్చారు ఈ సీనియర్ హీరోయిన్. వర్మ సినిమాల్లో అవకాశం రావడం తన అదృష్టమని.. ఇలాంటి రూమర్స్ నమ్మొద్దని ఆమె హితవు పలికారు. రామ్ గోపాల్ వర్మతో తనకు ఎలాంటి గొడవలు లేవని ఆమె తేల్చిచెప్పారు.

45 ఏళ్ల వయసులో ఐటెం సాంగ్‌తో హల్‌చల్

కాంగ్రెస్ టూ శివసేన

తొలి నుంచి రాజకీయాలపై ఆసక్తితో ఉండే ఊర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరి హస్తం పార్టీ కోసం శ్రమించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ముంబై నార్త్ నుంచి పోటీ చేసిన ఆమె ముమ్మరంగా ప్రచారం చేశారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ ఎన్నికల్లో ఊర్మిళ ఓడిపోయారు. పరాజయంతో కృంగిపోయిన ఊర్మిళ సొంత పార్టీ నేతల వల్ల తాను ఓడిపోయానని సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఆ వెంటనే శివసేన పార్టీలో చేరి షాకిచ్చారు.

డిజైనర్ శారీలో ఊర్మిళ గ్లామర్ షో

ఈ ఏజ్‌లోనూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అతి కొద్దిమంది నటీమణుల్లో ఊర్మిళ కూడా ఒకరు. సినిమాలు, షోలు, రాజకీయాలు , ఇతర వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకునే ఊర్మిళ అన్ని అంశాలపై స్పందిస్తుంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్‌లతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు. ఫ్యాషన్ విషయంలో కుర్ర హీరోయిన్లకు సైతం పాఠాలు చెబుతారు. తాజాగా ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన చీరలో కనిపించి ఆకట్టుకున్నారు ఊర్మిళ. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: urmila matondkar movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X