తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. ప్యాంటు విప్పి మరీ అలా చూపిస్తూ!

తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో చాలా తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచి హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో క్యూట్ లేడీ ప్రణిత సుభాష్ ఒకరు. చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంటరైన ఈ అమ్మడు.. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అదే సమయంలో వివాహం చేసుకుని తల్లైంది కూడా. తర్వాత కెరీర్ కంటిన్యూ చేసిన ప్రణిత ఇప్పుడు మరోసారి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని సదరు హీరోయిన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!

స్టార్ హీరోలతో సినిమాలు
ప్రణిత సుభాష్ టీనేజ్‌లో ఉన్నప్పుడే 'పోర్కి' అనే కన్నడ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత 'ఏం పిల్లో ఏం పిల్లడో' అనే మూవీతో తెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఆమెకు ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే తెలుగులోని స్టార్లతో కలిసి 'అత్తారింటికి దారేది', 'రభస', 'బ్రహ్మోత్సవం' వంటి భారీ చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో హవాను చూపించింది.

Atharintiki Daaredi Fame Pranitha Subhash Shares Baby Bump Photos in Instagram

నేషనల్ వైడ్‌గా పాపులర్
తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన ప్రణిత సుభాష్.. దక్షిణాదిలో మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టిన ఈ హీరోయిన్.. 'హంగామా 2', 'భుజ్: ద ప్రైజ్ ఆఫ్ ఇండియా' అనే చిత్రాల్లో నటించింది. తద్వారా తన క్రేజ్‌ను నేషనల్ రేంజ్‌కు పెంచుకుంది. ఇలా చాలా కాలం పాటు తనదైన మార్క్ చూపింది.

సినిమాలు, షోలు చేస్తూ
2021లో ప్రముఖ బిజినెస్‌మ్యాన్ నితిన్ రాజ్‌ను ప్రణిత సుభాష్ ప్రేమ పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలోనే ఓ బిడ్డకు సైతం తల్లైంది. ఆ తర్వాత మళ్లీ ఆమె ముఖానికి మేకప్ వేసుకుని కెరీర్‌ పరంగా రీఎంట్రీ ఇచ్చింది. ఇలా ప్రణిత 'రమణ అవతార' అనే కన్నడ మూవీతో పాటు దిలీప్ మలయాళ సినిమాలోనూ నటిస్తోంది. అలాగే, ఢీ షోతో తెలుగు వాళ్లను సైతం మెప్పించింది.

అక్కడ యమా బిజీగానే
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తోన్న ప్రణిత సుభాష్.. ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతోంది. అయినా సోషల్ మీడియాలోనూ ఈ భామ తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా తన అభిమానులను ఎప్పుడూ అలరిస్తూ క్రేజ్‌ను పెంచుకుంటోంది.

Atharintiki Daaredi Fame Pranitha Subhash Shares Baby Bump Photos in Instagram

బేబీ బంప్ పిక్స్ వదిలి
సుదీర్ఘమైన సినిమా ప్రయాణంలో డీసెంట్ రోల్స్ చేసిన ప్రణిత సుభాష్.. సోషల్ మీడియాలో మాత్రం బాగా అలరిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె డోస్ పెంచేసి మరీ హాట్ షో చేస్తోంది. ఇలా తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రణిత సుభాష్ గర్భంతో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. దీంతో ఈ బేబీ బంప్ పిక్స్‌కు భారీ స్థాయిలో స్పందన వస్తోంది.

రెండో రౌండ్ అంటూ
తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రణిత సుభాష్ గర్భంతో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. అంతేకాదు, 'రెండో రౌండ్.. ఇక నా ప్యాంట్స్ సరిపోవు' అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో ఈ హీరోయిన్ రెండోసారి తల్లి కాబోతుందని స్ఫష్టం అయిపోయింది. దీంతో ప్రణిత సుభాష్‌కు చాలా మంది సెలెబ్రిటీలతో పాటు సామాన్యులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X