హైదరాబాద్‌లో నటి మీద ఎటాక్.. అసలు ఏమైంది అంటే?
హైదరాబాదులో సామాన్య మానవులకు రక్షణ లేకుండా పోతోంది. ఈ మధ్య కాలంలో నడుస్తున్న వ్యక్తుల చేతుల్లో ఫోన్లు లాక్కొని వెళ్ళిపోతున్న ఆకతాయిల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇప్పుడు ఏకంగా ఒక వర్ధమాన నటి చేతిలో ఫోన్ లాక్ వెళ్ళి పోవడంతో పాటు ఆమె మీద దాడి చేసిన ఘటన హైదరాబాద్లో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే

నడి బొడ్డున
హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న కెబిఆర్ పార్క్ గురించి తెలియని వారు ఉండరు. ఒక పెద్ద అడవి మాదిరి ఉండే ప్రదేశం చుట్టూ అందరూ వాకింగ్ చేసేందుకు గాను వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి చుట్టూ మొక్కలు కూడా పెంచుతూ వస్తున్నారు నిర్వాహకులు.. అందుకే ఇక్కడ వాకింగ్ చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మామూలుగా బంజారాహిల్స్ పరిధిలో ఉన్న కేబీఆర్ పార్క్ లో ఉదయం, సాయంత్రం చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ వాకింగ్ చేస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే.

లాక్కునేందుకు ప్రయత్నం
అయితే ఇటీవల కాలంలో కేబీఆర్ పార్క్ లో నేరాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. తాజాగా కేబీఆర్ పార్క్ వద్ద ఒక సినీ నటి పై దాడి జరిగింది. శైలు చౌరాసియా అనే నటి వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని ఆగంతకుడు దాడి చేసి, ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నం చేశాడు.
దీంతో అప్రమత్తమైన నటి ఫోన్ ను గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరికీ మధ్య పెనుగులాట జరిగిందని అంటున్నారు. అయినా సరే ఆగంతకుడు ఆమెపై దాడి చేసి సెల్ ఫోన్ ఎత్తుకు పోయాడు.

పోలీసులకు సమాచారం ఇవ్వడంతో
నటి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి గాయపడిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మీద విచారణ కూడా చేస్తున్నారు. కేబీఆర్ పార్క్ లో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఉన్నాయి. అయినా సరే ఇక్కడ చోరీ జరగడం సంచలనంగా మారింది.

ఆదివారం రాత్రి
సామాన్యులతో పాటు సెలెబ్రిటీలు సైతం వాకింగ్, జాగింగ్ చేయడానికి కేబీఆర్ పార్క్ కు వస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ పోలీసులు కూడా గట్టి నిఘానే ఉంచుతారు. అయినా సరే కేబీఆర్ పార్క్ దగ్గర నటి చౌరాసియా పై దాడి జరిగడం ఆంచకనంగా మారింది. ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో వాకింగ్ వెళ్లగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.
Recommended Video

సినిమాలు
కెరియర్ మొదట్లో మోడలింగ్ చేసిన షాలు చౌరాసియా ఆ తర్వాత శైలు అనే సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఓ పిల్లా నీ వల్ల అనే సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా నటించింది. అలాగే అరణ్య అనే ఒక హారర్ థ్రిల్లర్ మూవీ లో కూడా చౌరాసియా నటించింది. అయితే ప్రస్తుతానికి ఎలాంటి సినిమాలలో నటించడం లేదు గానీ మోడలింగ్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. పలు ఈవెంట్లలో పాల్గొంటూ షాప్ ఓపెనింగ్స్ చేస్తూ ఆమె వార్తల్లో నిలుస్తోంది. మొత్తం మీద ఆమె మీద దాడి జరిగిన విషయం మాత్రం సంచలనంగా మారింది.


Click it and Unblock the Notifications











