చిన్నారి పెళ్లి కూతురు తల్లి కాబోతుందా? స్పందించిన హీరోయిన్
యంగ్ హీరోయిన్ అవికా గోర్ (Avika Gor) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్నారి పెళ్లికూతురు(బాలికా వధు) సీరియల్‍తో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. ఈ ఫేమ్ తో 2013లో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, 10th క్లాస్ డైరీస్, షణ్ముఖ వంటి పలు తెలుగు సినిమాలు చేసింది. తన నటనతో మెప్పించింది. అయితే, నటనపరంగా ప్రశంసలు అందుకున్నా కూడా టాప్ హీరోయిన్ గా అవికా ఎదగలేకపోయారు. ప్రస్తుతం ఆమె వరుసగా ఓటీటీ సిరీస్‍లు చేస్తున్నారు. అయితే.. హీరోయిన్ అవికా గోర్ ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం ఊపందుకుంది. ఈ అంశంపై అవికా స్పందించారు. ఇంతకీ ఏమన్నారంటే..?
అవికా- మిలింద్ 2020లో హైదరాబాద్‌లో తొలిసారి కలుసుకున్నారు. మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడింది. కొంతకాలానికే ఆ స్నేహం ప్రేమగా మారింది. 2025 జూన్‌లో ఈ లవ్‌బర్డ్స్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. అదే ఏడాది 'పతీ పత్నీ ఔర్ పంగా' అనే రియాలిటీ షోలో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహ వేడుక కలర్ టీవీలో ప్రసారం కావడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంపై అప్పట్లో అవికా మాట్లాడుతూ.. 'నా పెళ్లి నా వ్యక్తిత్వంలాగే అన్కన్వెన్షనల్‌గా ఉండాలి. నా జీవితం చాలా మందికి కలలా అనిపించవచ్చు. దానికి నేను కృతజ్ఞురాలిని. కానీ ఆ కృతజ్ఞతతో పాటు సవాళ్లు కూడా ఉంటాయి'అని చెప్పారు.

పుకార్లు ఎలా మొదలయ్యాయి?
నటి అవికా, మిలింద్ కలిసి ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. ఆ వ్లాగ్‌లో త్వరలోనే ఒక కొత్త ప్రయాణం మొదలు కానుందని ప్రకటించారు. దీంతో ప్రెగ్నెన్సీ చర్చ మొదలైంది. ఆ వీడియోలో ఇద్దరూ 'కొత్త ఆరంభాలు, జీవితంలో పెద్ద మార్పులు'అంటూ మాట్లాడారు. అవికా 'చాలా పెద్ద విషయం రాబోతోంది'అని చెప్పగా, మిలింద్ కూడా ఉత్సాహం, ఆందోళన రెండూ కలిసిన భావాలను వ్యక్తం చేశారు. దాంతో అభిమానులు వెంటనే గర్భవతి అన్న అర్థం తీసుకుని శుభాకాంక్షలు చెప్పడం మొదలుపెట్టారు. అప్పట్లో ఈ జంట స్పందించకపోవడంతో పుకార్లు మరింత ఊతం ఇచ్చినట్లు అయింది.
రూమర్స్ కు చెక్
హీరోయిన్ అవికా గోర్ ప్రెగ్నెంట్ రూమర్స్‌ను తాజాగా అవికా గోర్ కొట్టిపారేసింది. 2025లో సోషల్ ఎంట్రప్రెన్యూర్ ప్రియుడు మిలింద్ చంద్వానీని వివాహం చేసుకున్న అవికా, పెళ్లైన కొద్ది నెలలకే గర్భవతి అంటూ సోషల్ మీడియాలో పుకార్లు ఊపందుకున్నాయి. అయితే ఈ ఊహాగానాలన్నింటినీ తాజాగా ఆమె పూర్తిగా ఖండించారు. టెల్లీ టాక్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవికా మాట్లాడుతూ.. 'ఈ ప్రెగ్నెన్సీ రూమర్స్ అన్నీ పూర్తిగా తప్పు. అలాంటి విషయం ఏమీలేదు' అని స్పష్టంగా చెప్పారు. అభిమానులు తొందరపడి తప్పుడు నిర్ణయాలకు వచ్చారని కూడా ఆమె పేర్కొన్నారు. దీంతో కొన్ని రోజులుగా సాగుతున్న చర్చకు ఆమె మాటలు ఫుల్ స్టాప్ పెట్టినట్టయ్యాయి.
అయితే ఇక్కడే అవికా మాటలు ఆగలేదు. 'అది కాకుండా ఇంకొక న్యూస్ ఉంది. ఏంటో త్వరలోనే చెబుతాం'అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో కొత్త ఆసక్తిని రేకెత్తించాయి. దీంతో ఇప్పుడు ఆ 'ఇంతకీ ఆ వార్త ఏంటి? అది కొత్త టీవీ లేదా ఓటీటీ ప్రాజెక్టా? వ్యక్తిగత జీవితంలో మరో కీలక అడుగేనా? లేక పూర్తిగా ఊహించని సర్‌ప్రైజా? అన్నది త్వరలోనే వెల్లడిస్తానని ఆమె చెప్పారు. దీంతో అవికా నుంచి వచ్చే తదుపరి అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











