తొలిసారి అలాంటి సీన్‌లో అసౌకర్యంగా.. సెట్‌లో ఇబ్బంది పడ్డా.. అవికా గోర్

అవికా గోర్ (Avika gor) గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. 'బాలిక వధు', 'ససురాల్ సిమర్ కా' వంటి సీరియల్స్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి అవికా గోర్. "చిన్నారి పెళ్లికూతురు" తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ తరువాత 'ఉయ్యాల జంపాల' వంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా తెలుగు సినిమా 'అగ్లీ స్టోరీ'. తాజాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాననీ, తొలిసారి అలాంటి అనుభవం ఎదుర్కొన్నంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏమైంది.

యంగ్ హీరో నందు, అవికా గోర్ (Avika gor) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా అగ్లీ స్టోరీ (Ugly story). లక్కీ మీడియా, రియాజియా సంస్థ సంయుక్తంగా నిర్మించిన‌ సినిమాను ప్రణవ్ స్వరూప్ రచన, దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మే 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. రియా జియా ప్రొడక్షన్స్ పతాకంపై సిహెచ్ సుభాషిణి, కొండా లక్ష్మణ్ నిర్మించిన ఈ సినిమాలో రవితేజ మహాదాస్యం, శివాజీ రాజా, ప్రజ్ఞా నయన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించగా, శ్రీ సాయి కుమార్ దార సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు.

Avika Gor felt uncomfortable shooting intense scenes in Ugly Story shares experience

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ అవికా గోర్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అవికా మాట్లాడుతూ... ఆ పాత్రను ప్రేక్షకులు ద్వేషించాలనే ఉద్దేశంతోనే తీర్చిదిద్దారని, అదే ఆ కథ యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు. షూటింగ్ సమయంలో కొన్ని సన్నివేశాల్లో ఆ పాత్ర ప్రవర్తనను చూసి తాను అసహనానికి గురయ్యానని, తన కెరీర్‌లో తొలిసారి సెట్లోనే అసౌకర్యంగా ఫీల్ అయ్యానని చెప్పారు. "ఆ పాత్ర వల్ల నాకు అసహ్యం కలిగింది. ఆ సన్నివేశాల నుంచి బయటకు రావాలనిపించింది. కానీ అదే ఆ పాత్ర బలం" అని పేర్కొన్నారు.

ఇలాంటి కథలు ప్రేక్షకులకు ఒక రియాలిటీ చెక్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. "చాలా సినిమాలు కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వస్తాయి. మరికొన్ని సామాజిక సందేశాలు ఇస్తాయి. కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులకు అద్దం చూపిస్తుంది. కొందరు ఇలాంటి సినిమాలను చూడటానికి ఇష్టపడకపోయినా, ఇవి సమాజానికి అవసరం. మనం వాస్తవాలను ఎదుర్కోవాలి" అంటూ అవికా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఇక దర్శకుడి గురించి కూడా అవికా ప్రశంసలు కురిపించారు. కథ, దర్శకత్వంపై తనకు ప్రత్యేకమైన నమ్మకం ఉందని, ఈ ప్రాజెక్ట్‌పై తనకు ఉన్న విశ్వాసం ఇతర సినిమాల కంటే భిన్నంగా ఉందని చెప్పారు. "డైరెక్టర్ క్లారిటీతో పని చేశారు. ఇది ఆయన తొలి సినిమా అనిపించలేదు. ఆయన విజన్ వల్లనే నా నటన కూడా సులభంగా మారింది" అంటూ ఆయనను అభినందించారు.అలాగే ఈ సినిమా గురించి భవిష్యత్తులో తిరిగి చూసుకున్నప్పుడు ఇది తన కెరీర్‌లో అత్యంత గర్వకారణమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని అవికా తెలిపారు.

"ఇంకా ఐదు, ఆరు సంవత్సరాల తర్వాత ఈ సినిమాను చూసినా నేను గర్వంగా ఫీల్ అవుతాను" అని అన్నారు. ప్రస్తుతం అవికా గోర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.

Read more about: ugly story shivaji raja avika gor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X