కాదనలేకపోయాను.. నా కంఫర్ట్ జోన్ కాకపోయినా చేయాల్సి వచ్చింది: అవికా
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో ఫేమస్ అయిన అవికా గోర్.. టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. చేసిన మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుని.. ఇక్కడ అవకాశాలను అందిపుచ్చుకుంది.

హోమ్లీ హీరోయిన్..
ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామా, ఎక్కడికి పోతావు చిన్నివాడ చిత్రాల్లో మంచి పాత్రలను పోషించి.. సినిమా విజయంలో కీలకపాత్రను పోషించింది. ఆ సినిమాల్లో తన నటకు మంచి మార్కులే పడ్డాయి. అయితే అవికా మాత్రం తెలుగులో అంతగా కనిపించడం లేదు.

తాజాగా రాజుగారి గది 3 తో
హారర్ చిత్రమైన రాజుగారి గది 3 తో మరో సారి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ మూవీలో అవికా పాత్రను మొదటగా తమన్నాను తీసుకున్నారు. మూవీ ఓపెనింగ్ రోజున కూడా తమన్నా వచ్చింది. కానీ తీరా చూస్తే తమన్నా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.

నో అని చెప్పడానికి కారణం లేదు...
ఇదే విషయాన్ని మీడియాతో చెబుతూ.. మొదటగా ఈ పాత్రకు తమన్నాను తీసుకున్నారు. అయితే ఆమె డేట్స్ సర్దలేకపోవడంతో నా వద్దకు వచ్చింది. స్టోరీ చెప్పారు.. వద్దు అని చెప్పడానికి నాకు ఎలాంటి కారణాలు దొరకలేదు. వెంటనే ఓకే చెప్పేశాను.

నా జోనర్ కాకపోయినా..
కథ చెప్పేటప్పుడు ప్రతీ సీన్‌కు నేను భయపడ్డాను, ప్రేక్షకులు కూడా సినిమా చూసేటప్పుడు కూడా అలానే ఫీలవుతారు. నేను అన్ని రకాల పాత్రలను చేయాలనుకుంటున్నాను. నా చిన్నప్పటినుంచి ప్రేక్షకులు నన్ను చూస్తూనే ఉన్నారు. ఎప్పుడూ ఒకేలా చేస్తే.. వారికి నచ్చకపోవచ్చు. అందుకే అన్ని రకాల పాత్రలను చేయాలనుకుంటున్నాను. హారర్ అనేది నా జానర్ కాకపోయినా.. నేను నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశానంటూ చెప్పుకొచ్చింది.

మూడో పార్ట్‌తో హిట్టు కొడతారా?
అశ్విన్ హీరోగా , షకలక శంకర్, ధన్‌రాజ్ కమెడియన్స్‌గా వచ్చిన రాజు గారిగది ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. అయితే రెండో పార్ట్‌లో కింగ్ నాగార్జున, సమంత వచ్చి చేరారు. కామెడీ పాళ్లు తక్కువ కావడంతో అది అంతగా ఆకట్టుకోలేకపోయింది. మరి ఈ మూడో పార్ట్‌తో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయనున్నారో చూడాలి. ఈ శుక్రవారం (అక్టోబర్18) రోజున ఈ మూవీ విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











