twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మూడో హీరోయిన్‌తోనైనా ఆ డైరెక్టర్ సర్దుకుంటాడా? ఇప్పటికే ఇద్దరిని సాగనంపి..

    |

    ఉయ్యాల జంపాల చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమకు చేరువై ఆ తర్వాత సినిమా చూపిస్త మావ చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకొన్న హీరోయిన్ అవికా గోర్ ఆ తర్వాత కనిపించకుండా పోయింది. తాజాగా మళ్లీ రాజు గారి గది 3 సినిమాతో ప్రేక్షకులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నది. అయితే ఈ సినిమాలో వివాదాస్పద అంశంతో నేపథ్యంలో అవికా ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టడం చర్చనీయాంశమైంది.

    రాజు గారి గది సినిమా కోసం ముందుగా కాజల్ అగర్వాల్ అనుకొన్నారు. రెమ్యునరేషన్ వర్కవుట్ కావడంతో దర్శకుడు ఓంకార్‌కు ఈ బ్యూటీ హ్యాండించింది. ఆ తర్వాత తమన్నా భాటియాను రంగంలోకి దించారు. అంతా సవ్యంగా సాగుతున్నారనే క్రమంలో తమన్నా కూడా గుడ్‌బై చెప్పింది.

    Avika Gor re entry in tollywood for Raju Gari Gadhi 3

    అయితే బయటకు తెలియన కారణాల వల్ల తమన్నాను ఆ సినిమా నుంచి తప్పించారనే ప్రచారం జరిగింది. కానీ స్క్రిప్టులో దర్శకుడు ఓంకార్ చేసిన మార్పులు నచ్చని తమన్నా సినిమా నుంచి బయటకు వెళ్లినట్టు మరో వార్త వినిపించింది.

    తమన్నా తప్పుకోవడంతో ఎక్కడికి పోతావుతావురా చిన్నవాడ తర్వాత దాదాపు కనుమరుగైన అవికాను ఈ సినిమాలోకి పట్టుకొచ్చారు. తొలుత కాజల్ అగర్వాల్‌ను, ఆ తర్వాత తమన్నాను ఈ సినిమా హీరోయిన్‌గా అనుకొన్నది నిజమే. కానీ వారిద్దరితో వర్కవుట్ కాకపోవడంతో ఈ ఇప్పుడు అవికాను తీసుకున్నారు అని సినిమా యూనిట్‌కు చెందిన వారు పేర్కొన్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయనున్నారు.

    వరుస విజయాలు ఖాతాలో చేరిన తర్వాత అవికా గోర్ అనూహ్యమైన నిర్ణయం తీసుకొన్నారు. న్యూయార్క్ ఫిల్మ్ అకాడబీలో స్క్రీన్ ప్లే కోర్సును చేయడానికి వెళ్లడంతో అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌కు మధ్య గ్యాప్ ఏర్పడింది. ఇక ఈ సినిమాతో మరోసారి టాలీవుడ్‌లో తిష్టవేయడానికి ప్రయత్నిస్తున్నది అవికా గోర్. ఇదిలా ఉండగా, సినిమా ప్రారంభం కాకముందే ముగ్గురు హీరోయిన్లు తెరపైకి వచ్చారని.. అవికా గోర్ కూడా ఉంటారా? లేదా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు సినీ వర్గాలు.

    ఇదిలా ఉంటే, గతంలో రాజు గారి గది, రాజు గారి గది 2తో మంచి విజయాలు అందుకొన్న ఓంకార్ హ్యాట్రిక్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.

    English summary
    Uyyala Jampala, Cinema Choopistha Maava fame Avika Gor again in tollywood. She has been roped for Raju Gari Gadhi 3. Before Avika, Kajal and Tamannaah Bhatia were consider for this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X