లుక్ కోసం అలాంటి సర్జరీ? దిమ్మతిరిగేలా అవికా గోర్ రియాక్షన్
సినీరంగంలో అందానికే మొదటి ప్రాధాన్యత అనేది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అందంగా ఉన్నంతకాలమే హీరోయిన్లు ఇండస్ట్రీలో ఉండగలరు. ఏ మాత్రం తేడా వచ్చినా కెరీర్ గల్లంతే. అందుకే ముద్దుగుమ్మలు డైటింగ్‌కి, వర్కవుట్స్‌కు ప్రాధాన్యత ఇస్తారు. ఎంతటి ఇష్టమైనవి ముందున్నా సరే నోరు కట్టేసుకోవాల్సిందే. అయితే కొందరు హీరోయిన్లు తమ అందాన్ని మరింత పెంచుకోవడానికి, వయసు కనిపించకుండా చేయడానికి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు. పలువురి విషయంలో మాత్రం నిరాధారమైన వార్తలు వస్తుంటాయి. తాజాగా యంగ్ హీరోయిన్ అవికా గోర్‌పై ఇలాంటి రూమర్స్ రాగా.. దీనికి ఆమె క్లారిటీ ఇచ్చారు.
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో చిన్న వయసులోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు అవికా గోర్. ఆ తర్వాత ససురాల్ సిమర్ కా, లాడో వీర్పూర్ కి మర్దని తదితర సీరియల్స్‌తో సత్తా చాటింది అవిక. అనంతరం 2013లో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు అవికా. ఆ వెంటనే లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావా, తను నేను, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజు గారి గది 3, నెట్, బ్రో, టెన్త్ క్లాస్ డైరీస్, థ్యాంక్యూ, పాప్‌కార్నర్, ఉమాపతి, షణ్ముఖ వంటి వంటి సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నారు అవికా. టాలీవుడ్‌తో పాటు హిందీ, కన్నడ, కజక్ భాషలలో పలు చిత్రాలలో నటించింది. అలాగే పాప్‌కార్న్ సినిమాకు నిర్మాతగానూ మారింది. ఇటీవల తెలుగులో అగ్లీ స్టోరీలో నటించారు అవికా గోర్. ఇదే సమయంలో భర్త కెరీర్ కోసం ఆమె భారతదేశాన్ని వదిలి బ్యాంకాక్‌లో స్థిరపడేందుకు నిర్ణయించుకోవడం కలకలం రేపింది. ఇటీవల ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవికా గోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చిన్నారి పెళ్లి కూతురు చేసిన తర్వాత ఆ లుక్‌ని మెయింటైన్ చేయడానికి మీరే ఏదో ట్రీట్‌మెంట్ తీసుకున్నారని గాసిప్ ఉందని యాంకర్ ప్రశ్నించగా.. దీనికి అవికా గోర్ స్పందించారు. నేను ఒక ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వాస్తవమే. అది కూడా ముఖం మీద పింపుల్స్ తొలగించుకోవడానికే. కానీ అది కూడా సరిగా పనిచేయలేదు. అయితే అవసరాన్ని బట్టి బైఫిషియల్, బ్లడ్ సెల్స్ తొలగించుకోవడానికి అప్పుడప్పుడు పార్లర్‌కి వెళ్లేదానిని. నటిగా నాకు అది అవసరం కూడా అని అవికా గోర్ చప్పారు.
అయితే చాలామంది అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తారు. 7 ఏళ్ల వయసులోనే నేను మేకప్ వేసుకున్నా.. దాంతో చర్మాన్ని కాపాడుకోవడానికి సన్‌స్క్రీన్ వాడేదానిని. అంతేకాకుండా సర్జరీలు, పార్లర్‌లు వంటి వాటిని మా అమ్మ అస్సలు ఒప్పుకునేది కాదు. చిన్న టాటూ కాదు కదా హెయిర్ కట్ చేసుకున్నా ఆమె టెన్షన్ పడిపోయి నా మీద అరిచేది. చిన్న చిన్న వాటికే మా అమ్మానాన్నల్ని ఒప్పించలేకపోయేదానిని. అలాంటిది కాస్మోటిక్ సర్జరీలు చేయించుకోగలనా? అని అవికా గోర్ ప్రశ్నించారు.
నేను ప్రేక్షకుల ముందే పెరిగి పెద్దయ్యాను. చాలా త్వరగా బరువు పెరిగేదానిని, అంతే వేగంగా బరువు తగ్గేదానిని. షూటింగ్ లేకపోతే తినడమే పనిగా పెట్టుకునేదానిని.. లక్ష్మీరావే మా ఇంటికి తర్వాత బాగా లావు అయ్యాను. రాజు గారి గది టైంకి కొంచెం తగ్గాను. వయసు పెరిగే కొద్ది శరీరంలో మార్పులు వస్తాయి.. చిన్నప్పటి నుంచి అందరూ నన్ను చూస్తూ రావడంతో నా శరీరంలో ఏ మాత్రం మార్పులు వచ్చినా సర్జరీలు చేయించుకున్నానని వదంతులు వ్యాప్తి చేసేవారు. వయసులో నా కంటే పెద్ద అయిన హీరోహీరోయిన్లు కూడా బాడీని ఫిట్‌గా ఉంచుకుంటున్నారు. సమంత, రష్మిక మందన్నా, పూజా హెగ్డే వంటి వారు నన్నెప్పుడూ ఇన్‌స్పైర్ చేస్తుంటారు. వారిని చూసినప్పుడు నేనెందుకు చేయకూడదు అనుకున్నా. కొంచెం కష్టమైనా ప్రయత్నిస్తున్నానని అవికా గోర్ తన ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications


