ఇండియా వదిలి వెళ్లిపోతున్న టాలీవుడ్‌ హీరోయిన్... అతని వల్లనే..

పలు కారణాలతో హీరోయిన్లు భారతదేశాన్ని విడిచి మరో దేశంలో స్థిరపడుతున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. తన భర్త నిక్ జోనాస్‌తో కలిసి లాస్ ఏంజెల్స్‌లోనే ఉంటున్నారు. షూటింగ్స్ ఉంటే ఇండియాకు వస్తున్నారు. ఈమె మాత్రమే కాదు ఇలియానా, సోనమ్ కపూర్, మీనాక్షి శేషాద్రి, సెలీనా జైట్లీ, ప్రీతి జింటా తదితర ముద్దుగుమ్మలు భారత్‌కు దూరంగా విదేశాల్లోనే ఉంటున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో హీరోయిన్ చేరింది. ఈ వివరాల్లోకి వెళితే..

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో చిన్న వయసులోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు అవికా గోర్. ఆ తర్వాత ససురాల్ సిమర్ కా, లాడో వీర్పూర్ కి మర్దని తదితర సీరియల్స్‌తో సత్తా చాటింది అవిక. ఆమె నటించిన సీరియల్స్ హిందీ నుంచి ప్రాంతీయ భాషల్లోకి అనువాదమై అక్కడా మంచి గుర్తింపు లభించింది. ఈ చిన్నారి పెళ్లికూతురికి హీరోయిన్‌గా తొలుత అవకాశం ఇచ్చింది తెలుగు పరిశ్రమే. 2013లో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు అవికా. రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది.

Avika Gor Shifts Permanently to Bangkok with Her Husband Says Career Won t Be Affected

ఆ వెంటనే లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావా, తను నేను, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజు గారి గది 3, నెట్, బ్రో, టెన్త్ క్లాస్ డైరీస్, థ్యాంక్యూ, పాప్‌కార్నర్, ఉమాపతి, షణ్ముఖ వంటి వంటి సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నారు అవికా. టాలీవుడ్‌తో పాటు హిందీ, కన్నడ, కజక్ భాషలలో పలు చిత్రాలలో నటించింది. అలాగే పాప్‌కార్న్ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించారు. సినిమాలు చేస్తున్నప్పటికీ సీరియల్స్‌ను మాత్రం ఆమె విడిచిపెట్టలేదు. ప్రస్తుతం తెలుగులో అగ్లీ స్టోరీలో నటించారు అవికా గోర్. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

మిళింద్ చద్వానీ అనే వ్యక్తితో ప్రేమాయణం సాగించిన అవికా గోర్.. గతేడాది సెప్టెంబర్ 30న పెళ్లి చేసుకున్నారు. తొలుత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన మిళింద్ ఆ తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. క్యాంప్ డైరీస్ పేరిట ఓ ఎన్జీవోని స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతున్నారు. 2019లో రోడీస్ రియల్ హీరోస్ షోతో మిళింద్ బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించారు. ఈ క్రమంలో కామన్ ఫ్రెండ్స్ ద్వారా మిళింద్ - అవికల మధ్య పరిచయం ఏర్పడి.. అది కాస్తా ప్రేమగా మారింది. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమాయణం సాగించిన అనంతరం ఇద్దరూ పెద్దల అంగీకారంతో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు.

భర్త, కుటుంబంతో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న అవికా గోర్ తాజాగా బాంబు పేల్చారు. తను భారతదేశాన్ని వీడి వెళ్లిపోతున్నట్లు ప్రకటించారు. బ్యాంకాక్‌లో శాశ్వతంగా స్థిర నివాసం ఉండనున్నట్లు తెలిపింది. ఇటీవలో ఓ ఛానెల్‌తో ఆమె మాట్లాడుతూ.. తన భర్త మిళింద్‌తో కలిసి బ్యాంకాక్‌కు మకాం మారామని తెలిపింది. అక్కడే ఓ ఇల్లు కొనుగోలు చేశాం.. నా భర్తకు అక్కడ లభిస్తున్న అవకాశాలతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎంతో కాలంగా కలిసున్న మేమిద్దరం ఒకరి కెరీర్‌ను మరొకరు గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాం. బ్యాంకాక్‌లో ఉన్నప్పటికీ సినిమాలను వదిలిపెట్టను.. షూటింగ్స్ ఉంటే ముంబై, హైదరాబాద్‌కు రావడంలో ఇబ్బంది లేదు. తరచూ ప్రయాణాలు చేసిన అనుభవం ఉండటంతో ఈ మార్పు తన జీవితం, కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపదని అవిక స్పష్టం చేశారు. మరి బ్యాంకాక్‌లో ఈమె జీవితం ఎలా సాగుతుందో చూడాలి.

Read more about: avika gor movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X