‘ సీనియర్ నటుడితో ఎఫైర్.. 18 ఏళ్లకే పెళ్లి.. సీక్రెట్ గా బిడ్డను కని'

సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి కొత్త విషయం కాదు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో అయితే చిన్న విషయం కూడా పెద్ద కథగా మారిపోతుంది. కొన్నిసార్లు ఈ రూమర్స్ వాళ్లను ఇబ్బందులకు గురి చేస్తే, మరికొన్నిసార్లు వాటిపై వారు నవ్వుతూ స్పందించే పరిస్థితి కూడా వస్తుంది. తాజాగా యంగ్ హీరోయిన్ తనపై వచ్చిన ఒక షాకింగ్ రూమర్ గురించి ఓపెన్ అవుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. చిన్న వయసులోనే పెళ్లి, బిడ్డ అంటూ వచ్చిన ఆ ఫేక్ స్టోరీపై ఆమె చెప్పిన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? అసలేం జరిగింది?

ఆ నటి ఎవరో కాదు.. యంగ్ హీరోయిన్ అవికా గోర్. ఈ నటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'బాలికా వధు'(చిన్నారి పెళ్లి కూతురు)సీరియల్‌తో చిన్న వయసులోనే గుర్తింపు తెచ్చుకున్నది. తర్వాత 'ఉయ్యాలా జంపాలా' ద్వారా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. ఆ మూవీ తరువాత ఎక్కడికి పోతావ్ చిన్నవాడా లాంటి హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇలా అవికా వరుసగా తెలుగు చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు కొత్తగా 'అగ్లీ స్టోరీ' అంటే సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

Avika Gor Shocks Fans With Viral Rumor About Secret Marriage and Child at 18

అవికా గోర్ తాజాగా నటించిన అగ్లీ స్టోరీ (Ugly Story) ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్‌ను అందుకుంటోంది. హీరో నందు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకి దర్శకుడు ప్రణవ్ స్వరూప్ దర్శకత్వం వహించారు. సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అవికా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటోంది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత షాకింగ్ రూమర్ గురించి ఓపెన్ అయింది.

ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో హీరోయిన్స్‌పై రూమర్స్ రావడం సాధారణమే అయినా, తనపై వచ్చిన ఆ కథ మాత్రం హద్దులు దాటిందని చెప్పింది. ముఖ్యంగా తన 18 ఏళ్ల వయస్సులోనే ఒక 32 ఏళ్ల నటుడితో ప్రేమలో ఉన్నానని, అంతేకాదు అతనితో పెళ్లి చేసుకుని బిడ్డకు జన్మనిచ్చానని రాసిన వార్తలు చూసి తాను ఆశ్చర్యపోయానని వెల్లడించింది. అయితే ఈ విషయం గురించి అవికా చాలా లైట్‌గా, ఫన్నీ గా రియాక్ట్ కావడం విశేషం. "ఆ రూమర్ చదివినప్పుడు నాకు షాక్ కాకుండా నవ్వొచ్చింది. అసలు ఆ నటుడితో నేను ఎప్పుడు ప్రేమలో పడ్డాను? ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను? బిడ్డ ఎక్కడ నుంచి వచ్చింది? అన్నదే అర్థం కాలేదు. కానీ ఆ స్టోరీ రాసిన వారి క్రియేటివిటీ మాత్రం అద్భుతంగా ఉంది" అంటూ నవ్వుతూ చెప్పింది.

ఇంకా ఆమె మాట్లాడుతూ, "మేమిద్దరం కలిసి పని చేశాం, అంతే. కానీ దాన్ని తీసుకుని ఇంత పెద్ద కథగా మలచడం నిజంగా ఆశ్చర్యమే. కేవలం లవ్ స్టోరీ కాదు, పెళ్లి, బిడ్డను కని, దాచిపెట్టడం వరకు వెళ్లారు. అంత లెవెల్‌లో కథ రాయడం అంటే నిజంగా టాలెంట్ కావాలి. అలాంటి వాళ్లు సినిమాలు తీయాలి" అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. అవికా గోర్ ఈ విధంగా రూమర్స్‌ను సీరియస్‌గా తీసుకోకుండా, హాస్యంగా తీసుకోవడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు నెటిజన్లు "ఇలాంటి రూమర్స్‌ని ఇంత కూల్‌గా హ్యాండిల్ చేయడం గొప్ప విషయం" అని ప్రశంసిస్తుండగా, మరికొందరు "ఇండస్ట్రీలో ఫేక్ న్యూస్ ఎంత వరకు వెళ్తుందో ఇదే ఉదాహరణ" అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more about: ugly story nandu avika gor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X