నాగార్జున హీరోయిన్‌కు వికటించిన సర్జరీ.. కొండ నాలుకకు మందు పెడితే..!
తమ వ్యక్తిగత వివరాలు, సినిమా సంగతులను అభిమానులతో పంచుకోవడానికి నటీనటులు సోషల్ మీడియా ఖాతాలను తెరుస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు అకౌంట్స్‌ను ఓపెన్ చేస్తున్నారు. రాష్ట్రం, దేశంలో జరిగే అంశాలపైనా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ, అభిమానులను ఆలోచింపజేస్తుంటారు. మరికొందరు ఎఫ్‌బీ, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో లైవ్‌లోకి వచ్చి యూజర్స్‌తో ఇంటరాక్ట్ అవుతుంటారు.
బయటే అనుకుంటే ఆన్‌లైన్‌లోనూ హీరోయిన్స్ వేధింపులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బాడీషేమింగ్ కామెంట్స్‌తో కొందరు నెటిజన్లు వారిని హింసిస్తుంటారు. స్వతహాగా హీరోయిన్లు అందానికి బ్రాండ్ అంబాసిడర్లు, ఆ అందం ఉంటేనే నాలుగు ఆఫర్స్ వచ్చి, పది కాలాల పాటు జనం గుర్తుంచుకుంటారు. ఇష్టమైనది తిన్నా, కొంచెం బరువెక్కినా ఇబ్బందే. సినిమాలలో కథ డిమాండ్ చేసిన మేరకు కొందరు ముద్ధుగుమ్మలు బరువు తగ్గడం, పెరగడం చేస్తుంటారు. అయితే ఇలా హీరోయిన్లు సన్నబడ్డా, లావెక్కినా .. ఇలా ఉన్నారేంటీ .. ఇక నువ్వు సినిమాలు చేయొద్దు అంటూ నెటిజన్లు ట్రోల్ చేసిన సందర్భాలు కోకొల్లలు.

బాడీ షేమింగ్ బారినపడ్డ వారిలో స్టార్ హీరోయిన్లు, అప్‌కమింగ్ అందగత్తెలు ఉన్నారు. వీరిలో కొందరు వెనువెంటనే రియాక్టయి సదరు వ్యక్తికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంటారు. ఉదాహరణకు స్టార్ యాంకర్ అనసూయ ఈ విషయంలో చాలా కఠినంగా ఉంటారు. తన గురించి ఎవరైనా నోరుజారితే అక్కడికక్కడే కడిగిపారేస్తుంటారు. ఈ ప్రాసెస్‌లలో తనను ఎవరు ఏమనుకున్నా సరే.. తన ఆత్మాభిమానాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదని ఎన్నోసార్లు నిరూపించుకుంది కూడా. అనసూయ నోటికి దడిసి నెటిజన్లు కాస్త జాగ్రత్తగానే ఉంటారు. కానీ అందరు అమ్మాయిలు అనసూయలా డేర్ అండ్ డాషింగ్‌గా ఉండలేరుగా.
తాజాగా ఇలాంటి బాడీ షేమింగ్ బారినపడ్డారు హిందీ ముద్దుగుమ్మ అయేషా టాకియా. పూరి జగన్నాథ్- కింగ్ నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ మూవీ ద్వారా తెలుగువారికి పరిచయమయ్యారు అయేషా. ఫస్ట్ మూవీతోనే తన అందం, క్యూట్ లుక్స్‌తో కుర్రాళ్లకు నిద్రలేని రాత్రుళ్లు మిగిల్చారు. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్, సంజయ్ దత్ లాంటి స్టార్స్ సరసన నటించిన ఆయేషా.. కెరీర్ పీక్స్‌లో ఉండగానే 2009లోనే పెళ్లి చేసుకుని షాకిచ్చింది. వివాహం తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైన ఆమె.. పండక్కో, పబ్బానికో అన్నట్లుగా కనిపిస్తుండేది.
అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే అయేషా టాకియా అప్పుడప్పుడు నెటిజన్లతో ఇంటరాక్ట్ అయ్యేది. ఇటీవల తన లేటెస్ట్ లుక్‌కు సంబంధించిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. అందులో బ్లూ కలర్ శారీ ధరించి, అస్సలు గుర్తుపట్టలేని విధంగా కనిపించిన అయేషాను చూసి అభిమానులు షాక్‌కు గురయ్యారు. వెంటనే ఇదేం లుక్.. ఎలా మారిపోయారేంటీ, ఎందుకు ఇలా చేసుకుంటున్నారు, నీ బుగ్గలెందుకు అలా అయ్యాయి, ప్లాస్టిక్ సర్జరీ వికటించింది, మరో శస్త్రచికిత్స చేయించుకో అంటూ నానా రకాలుగా ట్రోల్ చేసి హింసించారు.

ఈ దెబ్బతో అయేషా తీవ్ర మనస్తాపానికి గురై, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు. దీంతో ఏకంగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతానే డిలీట్ చేసేశారు అయేషా. ఆమె ఇన్‌స్టా కోసం నెటిజన్లు గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటే అది కనిపించడం లేదు. ఈ గొడవ సద్దుమణిగిన తర్వాత అయేషా తిరిగి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇవ్వొచ్చని , లేదంటే ఇక్కడితో ఫుల్‌స్టాప్ పెట్టేసినట్లేనంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











