ముద్దుల కొడుకుతో నాగార్జున హీరోయిన్.. లక్షకు పైగా లైక్స్!
బాలీవుడ్ భామ అయేషా టాకియా గుర్తుందిగా.. నటించింది ఒకే ఒక తెలుగు చిత్రం అయినప్పటికీ యువత హృదయాల్లో క్రేజీ భామగా మిగిలిపోయింది. నాగార్జున నటించిన యువత చిత్రంలో ఈ భామ అందాలకు యువత ఫిదా అయిపోయారు. ఆ తరువాత అయేషా టాకియా తెలుగులో నటించలేదు.
పెళ్ళైన తరువాత సినిమాకు పూర్తిగా దూరమైంది. అయేషా టాకియా ప్రస్తుతం నాలుగేళ్ళ కుమారుడికి తల్లి. తాజాగా తన కొడుకుతో ఉన్న ఫోటోని అయేషా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫొటోకు దాదాపు 1 లక్షా 25 వేళా లైక్స్ రావడం విశేషం. అయేషా ముద్దుల కొడుకు మిఖైల్ తన తల్లి బుగ్గలపై ముద్దు పెడుతున్న ఈ ఫోటో ఎంతో క్యూట్ గా ఉంది.

అయేషా కూడా స్టైలిష్ గా కనిపిస్తోంది. ఇన్నిరోజులు కుమారుడి ఆలనా పాలనా చూడడానికి సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం మిఖైల్ ఎదుగుతుండడంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు అయేషా సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











