For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  సెటైర్లు వేసిన సమంత.. ప్లీజ్ అలా మాట్లాడొద్దు అని చెప్పిన రామ్ చరణ్ వైఫ్ ఉపాసన!

  |
  Upasana & Samantha Latest Funny Interview Goes Viral || Filmibeat Telugu

  రామ్ చరణ్ వైఫ్ ఉపాసన... ఇటు భార్యగా, కొణిదెల ఇంటి కోడలిగా, అపోలో డైరెక్టర్‌గా తన బాధ్యతలు సమర్దవంతంగా నిర్వర్తిస్తూనే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అపోలో లైఫ్ ఫిట్‌నెస్ ప్రోగ్రామ్స్ గురించి ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉపాసన యాంకర్ అవతారంఎత్తి హీరోయిన్ సమంతను ఇంటర్వ్యూ చేశారు.

  ఈ సందర్భంగా సమంత నుంచి ఉపాసన పలు ఆసక్తికర సమాధానాలు రాబట్టారు. వీరి మధ్య జరిగిన సంభాషణలో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ప్రస్తావనకు వచ్చాయి. ఎక్కువగా ఫిట్‌నెస్ గురించి అంశాల చుట్టూ ఈ ఇంటర్వ్యూ సాగింది.

  అందుకే నిన్ను మొదట ఎంచుకున్నా సామ్

  అందుకే నిన్ను మొదట ఎంచుకున్నా సామ్

  ‘‘నాకు ఇలాంటి ఇంటర్వ్యూలు చేయడం కొత్త. అందుకే నిన్నే మొదటి గెస్ట్‌గా ఎంచుకున్నారు. నీతో ఉన్న సాన్నిహిత్యం వల్ల రిలాక్స్‌గా ఈ ఇంటర్వ్యూ చేయగలను అని'' అని ఉపాసన.. సమంతకు తెలిపారు.

  సెటైర్లు వేసిన సమంత.. ప్లీజ్ అలా మాట్లాడొద్దు అని చెప్పిన రామ్ చరణ్ వైఫ్ ఉపాసన!

  సెటైర్లు వేసిన సమంత.. ప్లీజ్ అలా మాట్లాడొద్దు అని చెప్పిన రామ్ చరణ్ వైఫ్ ఉపాసన!

  ఓ ప్రశ్నకు సమంత స్పందిస్తూ.. ‘చైతన్య, నేను ఇంటి పక్షులం. మీ లాగా (చరణ్, ఉాపాసన) కాదు.' అంటూ సమాధానం ఇచ్చింది. దీనికి ఉపాసన రియాక్ట్ అవుతూ ‘ప్లీజ్ అలా మాట్లాడకు... నువ్వు కూడా మాతో జాయిన్ అవ్వు. అలా తరచూ క్లబ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందో నువ్వే నేర్చుకుంటావ్' అని వ్యాఖ్యానించారు.

  సమంత అలా అనడంతో ఉాపాసన ఆశ్చర్యం

  సమంత అలా అనడంతో ఉాపాసన ఆశ్చర్యం

  ‘‘మీరు, చరణ్ కలిసి ఇండస్ట్రీలో యూనిటీ ఉండేలా కృషి చేస్తున్నారు'' అంటూ సమంత వ్యాఖ్యానించగా.... ఉపాసన రియాక్ట్ అవుతూ.. ‘‘అవునా? మాకు కూడా మేము అలా చేస్తున్నామనే ఆలోచన ఎప్పుడూ రాలేదే.. మేము జస్ట్ సరదాగా అందరితో అలా కలుస్తాం.'' అన్నారు.

  అలా ఖాళీ కడుపుతో అస్సలు వెళ్లను

  అలా ఖాళీ కడుపుతో అస్సలు వెళ్లను

  ‘‘జిమ్ కు వెళ్లే ముందు ఏమీ తినకుండా వెళ్తారా? '' అని ఉపాసన ప్రశ్నించగా... ‘‘లేదు.. ఏమీ తినకుండా అస్సలు వెళ్లను. ప్రోటీన్ షేక్ తీసుకుంటాను. అక్కడ మనం చాలా కేలరీలు బర్న్ చేయాల్సి ఉంటుంది. అందుకే ప్రోటీన్ షేక్, ఎగ్, పీనట్ బటర్ లాంటివి తీసుకుంటాను'' అని సమంత తెలిపారు.

  మాలాంటి ఫ్యాట్ పీపుల్ ఆలోచన అదీ

  మాలాంటి ఫ్యాట్ పీపుల్ ఆలోచన అదీ

  ‘‘సో అదన్నమాట సీక్రెట్.. ఫిట్‌గా ఉండే మీ లాంటి వారు ఏదైనా తీసుకున్నాకే వెళతారు. ఫ్యాట్‌గా ఉండే మా లాంటి వారమంతా ఖాళీ కడుపుతో వెళ్లి కేలరీలు కరిగించే ప్రయత్నం చేస్తాం.'' అని ఉపాసన చమత్కరించారు.

  నాగార్జున మామ ఫస్ట్

  నాగార్జున మామ ఫస్ట్

  ‘‘ఫిట్ నెస్ విషయంలో నాగార్జున మామకు ఫస్ట్ రేటింగ్ ఇవ్వొచ్చు. ఆయన లుక్, బాడీ అద్భుతంగా మెయింటేన్ చేస్తున్నారు. త్వరలో 60వ బర్త్ డే జరుపుకోబోతున్నారు. ఆ తర్వాత చై. సరదాగా కలిసిపుడు కూడా సలాడ్, ఫైబర్ ఫుడ్ మాత్రమే తింటాడు. నేనైతే బిర్యానీ, పనీర్ బటర్ మసాలా లాంగించేస్తాను'' సమంత అన్నారు.

  యాక్టర్ అవ్వకపోతే..

  యాక్టర్ అవ్వకపోతే..

  ‘‘యాక్టర్ అయ్యుండకపోతే ఏం చేసేదానివి'' అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘డెస్క్ జాబ్ చేసే దాన్నేమో. కానీ అది చాలా బోరింగ్ గా ఉంటుంది.'' అని సమంత తెలిపారు. ‘నేను స్ట్రాంగెస్ట్ ఉమెన్ యాక్టర్ అనే రూమర్ వస్తే బావుండు' అనిపిస్తుందని మరో ప్రశ్నకు సమంత ఆన్సర్ ఇచ్చారు.

  103 కేజీల బరువు ఎత్తగలను

  నేను 103 కేజీల బరువు ఎత్తగలను.. అని సమంత తెలుపగా... అంటే మీ భర్తను కూడా మీరు ఈజీగా ఎత్తగలరంటూ ఉపాసన ఆటపట్టించే ప్రయత్నం చేసింది. నాకు మియామి మ్యూజిక్ ఫెస్టివల్ అంటే ఇస్టమని సమంత ఈ సందర్భంగా తెలిపారు.

  English summary
  Upasana Kamineni Konidela in conversation with Samantha Akkineni for B Positive Magazine. "This is a first for me! samantharuthprabhuoffl thanks for taking care of me. 🥰. Ur absolutely awesome. " Upasana said.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more