బాహుబలి బ్యూటీ అందాల జాతర.. దాచి దాచని విధంగా గ్లామర్ ట్రీట్!

Nora Fatehi : దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి. ఈ సినిమాలో మనోహరి అనే ఐటమ్ సాంగ్ లో తన అందాల ఆరబోతతో కుర్రకారును మతి పోగొట్టింది. ఈ సాంగ్ తో తినలేని క్రేజ్ సంపాదించుకున్న ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ హాట్ బ్యూటీ ఎవరు? ఇంతకీ ఆ అమ్మడు ఫోటోలను ఓ లూక్కేయండి.

ఆ హాట్ బ్యూటీ ఎవరో కాదు.. బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి.. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కెనడాకు చెందిన నోరా ఫతేహి డ్యాన్సర్, మోడల్, నటి, నిర్మాత, సింగర్‌గా ఎన్నో పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల ఆదరాభిమానులు సంపాదించుకుంటోంది. ఐటమ్ సాంగ్ లలో తన మాస్ స్టెప్పులతో కుర్ర కారును అల్లాడిస్తుంది ఈ భామ. ఇలా బాలీవుడ్ హాట్ బ్యూటిల్లో ఒకరిగా గుర్తింపు సంపాదించుకుంది నోరా ఫతేహి.

Baahubali beauty Nora Fatehi Shares Stunning and hot pictures viral

తొలుత తెలుగులో టెంపర్ మూవీలో 'ఇట్టాగే రెచ్చిపోదాం' అనే స్పెషల్ సాంగ్ లో గ్లామర్ లేసింది బ్యూటిఫుల్ నోరా ఫతేహి. ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి అలరించింది. ఎన్టీఆర్ టెంపర్ తర్వాత రవితేజ కిక్ 2 సినిమాల్లో ఐటెం సాంగుల్లో తన అందాల ఆరబోతతో రెచ్చిపోయింది. అలాగే.. లోఫర్, ఊపిరి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లోనూ సెప్పులేసింది నోరా ఫతేహి. కానీ, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి పార్ట్ 1లోని మనోహరి సాంగ్‌తో ఫుల్ పాపులర్టీని సొంతం చేసుకుంది ఈ ఐటెం భామ.

అలాగే.. బాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ తో పాటు పలు కీలక పాత్రలు నటించింది నోరా ఫతేహి. అంతేకాదు.. ఈ అమ్మడు ఎక్కువగా వీడియో ఆల్బమ్స్ చేస్తుంటుంది. అలా.. అమెరికన్ సింగర్ జేసన్ డెరులో తో కలిసి స్నేక్ అనే వీడియో ఆల్బమ్ చేసింది నోరా ఫతేహి. ఇందులో నోరా అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్.. కుర్రకారు మతిపోగొట్టింది. సినిమాలు, అల్బమ్ మాత్రమే కాదు. సోషల్ మీడియా కూడా ఈ అమ్మడు రచ్చ చేస్తోంది.

తాజాగా మద్దుగుమ్మ నోరా ఫతేహి .. ఇన్ స్టాగ్రామ్ వేధికగా తన అందమైన ఫొటోలను షేర్ చేసింది. అందులో అల్ట్రా మోడ్రన్ లుక్ లో కనిపించి యూత్ ను కట్టి పడేస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. శారీలో నోరా ఫతేహి మిలిమిలా మెరిసిపోతుంది. తన ఎద అందాలను దాచుకుంటూ.. చిట్టి నడుము అందాలను చూపిస్తూ.. కుర్రకారును హీటెక్కిస్తోంది. ఈ హాట్ అందాలు క్షణాల్లో తెగ వైరలయ్యాయి. లైకులు, కామెంట్లు, షేర్లు చేస్తూ.. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి తన హాట్ పోజులతో ఇంటర్నెట్‌లో హీట్ రాజేసింది నోరా ఫతేహి.

More from Filmibeat

Read more about: baahubali nora fatehi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X