వైబ్రెంట్ శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. క్లాస్‌గా మత్తెక్కిస్తోన్న బేబీ హీరోయిన్!
తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం లేదంటూ పలువురు ముద్దుగుమ్మలు ఆరోపణలు చేస్తుంటారు. కానీ కొందరు మాత్రం తమ అందం, అభినయంతో స్టార్ ఇమేజ్ సంపాదిస్తున్నారు. ఈ కోవలోకే వస్తారు వైష్ణవి చైతన్య. షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఒకే ఒక్క సినిమాతో రాత్రికి రాత్రి స్టార్‌గా మారిపోయారు. తాజాగా వైష్ణవి చైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
4 జనవరి 1993న హైదరాబాద్‌లో జన్మించారు వైష్ణవి చైతన్య. చదువు పూర్తి చేసిన తర్వాత షార్ట్ ఫిల్మ్స్ ద్వారా నటిగా కెరీర్ మొదలుపెట్టిన ఆమె మధ్య మధ్యలో కొన్ని సినిమాల్లోనూ నటించింది. హీరో, హీరోయిన్ల చెల్లెలిగా,ఫ్రెండ్‌గా ఆమె మెప్పించింది. అన్నింటిలోకి షార్ట్ ఫిలింస్ వైష్ణవికి పాపులారిటీ తెచ్చిపెట్టాయి. ది సాఫ్ట్‌వేర్ డెవలపర్, అరెరె మానస, మిస్సమ్మ వంటి షార్ట్ ఫిల్మ్స్ వీటిలో ముఖ్యమైనవి. టచ్ చేసి చూడు, ఏ మాయ ప్రేమితో, అల వైకుంఠపురంలో, రంగ్ దే, టక్ జగదీష్, వరుడు కావలెను, ప్రేమదేశం వంటి సినిమాలలో నటించింది.

ఈ క్రమంలో సాయిరాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన బేబీ సినిమా ఆమె జీవితంలో టర్నింగ్ పాయింట్‌గా చెప్పొచ్చు. తొలుత పద్ధతిగా కనిపించి, కాలేజీలో చెడు సాహవాసాలతో జీవితాన్ని నాశనం చేసుకున్న అమ్మాయిగా వైష్ణవి అద్భుతంగా నటించారు. ప్రేమించిన ఇద్దరు అబ్బాయిలను మోసం చేసి మరోకరిని పెళ్లాడే క్యారెక్టర్‌లో ఒదిగిపోయారు. ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో పాటు బెడ్ రూమ్ సీన్స్‌లోనూ రెచ్చిపోయింది.
ఎంతో పద్ధతిగా కనిపించే వైష్ణవి చైతన్యను అలాంటి సీన్స్‌లో చూసి ఆమె అభిమానులు కూడా ఖంగుతిన్నారు. తెలుగు అమ్మాయిలు ఎలాంటి పాత్రలనైనా చేయడానికి వెనుకాడరని ఆమె నిరూపించారు. ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. కేవలం కమర్షియల్‌గానే కాకుండా విమర్శకుల ప్రశంసలు, అవార్డులు, రివార్డులు సైతం సొంతం చేసుకుని చిన్న సినిమాల్లో సంచలనం సృష్టించింది. ఏకంగా దాదాపు ఐదు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకుని రికార్డు నెలకొల్పింది.
బేబీ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటిగా వైష్ణవి చైతన్యకు ఫిలింఫేర్ అవార్డు దక్కింది. ఈ సినిమా తర్వాత వైష్ణవి చైతన్యకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. రీసెంట్‌గా దిల్‌రాజు ప్రొడక్షన్స్‌లో లవ్ మీ అనే సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. తర్వాత సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతోన్న ప్రాజెక్ట్‌లోనూ వైష్ణవి చైతన్య ప్రధాన పాత్ర పోషించింది. గ్లామర్ షోకు దూరంగా కథాబలం, తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలనే ఎంచుకుంటూ దూసుకెళ్తోంది వైష్ణవి .
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే వైష్ణవి చైతన్య తన సినిమాలు , వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. చీర, సాంప్రదాయ దుస్తుల్లో కనిపించడానికి ఇష్టపడే వైష్ణవి .. వాటిలోనే ఫోటో షూట్‌లు చూసి గిలిగింతలు పెడుతుంటారు. తాజాగా సిల్క్ శారీలో ఆమె చేసిన ఫోటో షూట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. మరి ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా వైష్ణవి చైతన్య అందాలపై ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











