Vaishnavi Chaitanya బేబీ బ్యూటీకి దిల్ రాజు బంపర్ ఆఫర్.. వైష్ణవీ చైతన్య పక్కన హీరో ఎవరంటే?

బేబీ సినిమాతో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకొన్న యువ హీరోయిన్ వైష్ణవీ చైతన్యకు వరుస ఆఫర్లు తలుపుతడుతున్నాయి. ఇప్పటికే పలు చిత్రాలతో బిజీగా ఉన్న ఆమెకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరో భారీ ఆఫర్‌ను అందించారు. దాంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పర్యవేక్షణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందించే సినిమాలో ఈ అవకాశాన్ని ఈ బ్యూటీ దక్కించుకొన్నది. ఈ ప్రాజెక్టు వివరాల్లోకి, అలాగే వైష్ణవి చైతన్య కెరీర్ గురించిన విశేషాల్లోకి వెళితే..

తెలుగు సినిమా రంగంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బేబీ రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. దాదాపు 97 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రంలో నటించిన వైష్ణవీ చైతన్యకు క్రిటిక్స్ నుంచి ప్రశంసల వర్షం కురిసింది. ఈ చిత్రంలో డీ గ్లామర్, గ్లామర్ పాత్రల్లో కనిపించి ఈ అందాల భామ.. ఫెర్ఫార్మెన్స్‌తో కూడా ఆకట్టుకొన్నది.

Baby Fame Vaishnavi Chaitanya to pair with Ashish Reddy in Dil Raju Productions

బేబీ చిత్రంతో దక్షిణాది సినిమాను ఆకట్టుకొన్న వైష్ణవీ చైతన్యకు భారీ ఆఫర్లు వచ్చాయి. కానీ ఆమె కంటెంట్ ఉన్న చిత్రాల వైపే మొగ్గు చూపుతున్నదనే విషయం తన సన్నిహితులు వెల్లడిస్తున్నారు. ఆ క్రమంలోనే టాలెంట్‌ను ప్రోత్సాహించే దిల్ రాజు, శిరీష్ ప్రస్తుతం ఆమెకు మరో మంచి రోల్‌ను ఆఫర్ చేసినట్టు తెలిసింది.

దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్‌పై తన సోదరుడి కుమారుడు అశీష్ రెడ్డి నటించే తదుపరి చిత్రంలో మంచి పాత్రను వైష్ణవి దక్కించుకొన్నారు. గ్లామర్, ఫెర్ఫార్మెన్స్ పాత్రను ఇష్టపడి చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో తెలిపారు.

Baby Fame Vaishnavi Chaitanya to pair with Ashish Reddy in Dil Raju Productions

హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి , నాగ మల్లిడి నిర్మిస్తున్న ఇంకా పేరు పెట్టని చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ వర్క్ చేస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పీసీ శ్రీరాం సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా అవినాష్ కోల్లా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X