Vaishnavi Chaitanya: బేబీకి ఇలాంటోడే కావాలంట... ట్రై చేస్తారా బాసూ?

ఒకే ఒక్క సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వైష్ణవి చైతన్య ఓవర్ నైట్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. మొదట్లో ఎన్నో వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ తీసినప్పటికీ రాని గుర్తింపు బేబీ సినిమా సక్సెస్ తో ఓవర్ నైట్ వచ్చేసింది. కానీ ఎప్పుడైతే షణ్ముఖ్ జశ్వంత్ తో కలిసి సాఫ్ట్ వేర్ డెవలపర్స్ వెబ్ సిరీస్ లో నటించిందో అప్పటి నుండి ఈమెకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉండేది. బేబీ సినిమాతో ఆ గుర్తింపు మరింత పెంచుకున్న ఈ భామ తనకు కాబోయే వరుడు ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది. ఆ వివరాలు లోకి వెళితే....

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వైష్ణవి చైతన్య ఎలా అయినా సినిమా హీరోయిన్ అవ్వాలని సినీ రంగ ప్రవేశం చేసింది. అలా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమెకు అంత సులభంగా ఏమీ అవకాశాలు దక్కలేదు. అందుకే ముందుగా కొన్ని వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ లు చేసింది. ఆ వెబ్ సిరీస్ తో సినిమాల్లో కూడా చెల్లి పాత్రల్లో అవకాశాలు వచ్చాయి. అలా ఆమె అల్లు అర్జున్ తో కలిసి అల వైకుంటపురంలో సినిమాలో అల్లు అర్జున్ కి చెల్లిగా నటించింది. కానీ పెద్దగా గుర్తింపు అయితే దక్కలేదు.

Baby Heroine Vaishnavi Chaitanya Interesting Comments on Her fiance

నాగశౌర్యతో వరుడు కావలెను అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించింది. కానీ సిల్వర్ స్క్రీన్ మీద పూర్తి స్థాయిలో ఆమె నటించిన పాత్ర బేబీ మాత్రమే. వైష్ణవి చైతన్యకు సాయిరాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమాలో హీరోయిన్ పాత్ర ఆమె జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది. ఇక బేబీ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పనిలేదు.

Baby Heroine Vaishnavi Chaitanya Interesting Comments on Her fiance

ఇక ఈ సినిమా చూడని యూత్ లేడని అనడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా హిట్ అయిన నేపథ్యంలో వైష్ణవి చైతన్య ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయిలో ఉండే క్వాలిటీస్ చెప్పింది. వైష్ణవి చైతన్య ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను తనకి కాబోయే భర్త మీద ఎలాంటి అంచనాలు పెట్టుకోవడం లేదని అతనికి ఆస్తిపాస్తులు అందచందాలు లేకపోయినా తనకు పరవాలేదని చెప్పుకొచ్చింది.

Baby Heroine Vaishnavi Chaitanya Interesting Comments on Her fiance

అవేమీ లేకపోయినా తనను మాత్రం బాగా చూసుకోవాలన్న ఆమె ఉన్నదాంట్లో ఇద్దరం హ్యాపీగా ఉండేలా ప్లాన్ చేయాలని చెప్పుకొచ్చింది. డబ్బులు లేకపోయినా నన్ను కేరింగ్ గా చూసుకుంటే అదే ఎక్కువ అంటూ తనకు కాబోయే భర్తలో ఇలాంటి క్వాలిటీస్ ఉండాలని బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య తన మనసులో మాట చెప్పుకొచ్చింది. ఇక బేబీ సినిమాలో అలాంటి పాత్ర చేయడంతో ఆమెకు అవకాశాలు రావేమో అనుకున్నారు కానీ ఆమెకు కూడా అవకాశాలు లభిస్తున్నట్లుగా తెలుస్తోంది చూడాలి. మరి ఎంతవరకు ఆమెకు అవకాశాలు వస్తున్నాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X