Vaishnavi Chaitanya: అప్పుడే మొదలెట్టిన బేబి హీరోయిన్.. చీరలోనూ అందాల ఆరబోత

సినీ రంగంలో ఆరంభంలోనే ఫేమస్ అవ్వాలంటే అది సాధ్యమయ్యే విషయమే కాదు. కానీ, దీన్ని కొందరు అమ్మాయిలు మాత్రం సుసాధ్యం చేస్తూ సంచలనం అవుతున్నారు. అందులో అచ్చ తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈ పిల్ల.. రీసెంట్ సెన్సేషన్ 'బేబి' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ చిత్రంలో అదిరిపోయే నటనతో అదరగొట్టేసింది. ఫలితంగా ఎనలేని క్రేజ్‌ను, ఆఫర్లను సొంతం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో వైష్ణవి తాజాగా కొన్ని బోల్డు పిక్స్ షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

యూట్యూబర్.. ఆ సిరీస్‌తో:తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య యూట్యూబర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. ఆ తర్వాత డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇలా షణ్ముఖ్ జస్వంత్ హీరోగా చేసిన 'సాఫ్ట్‌వేర్ డెవలపర్స్'తో ఒక్కసారిగా సెన్సేషన్ అయింది. అప్పటి నుంచి ఈ అమ్మడు ఎన్నో సూపర్ హిట్ సిరీస్‌లలో నటించి పాపులర్ అయింది.

Baby Heroine Vaishnavi Chaitanya Latest Stinning Photos Viral

సినిమాల్లోకి.. బన్నీ చెల్లిగా:సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో వెబ్ సిరీస్‌లలో నటించి మెప్పించిన తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య.. ఆ తర్వాత సినిమాల్లోకి సైతం అడుగు పెట్టింది. ఇలా తన కెరీర్‌లో 'టక్ జగదీష్', 'రంగ్ దే', 'వరుడు కావలెను', 'ప్రేమదేశం', 'వలిమై' సహా ఎన్నో చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా 'అల.. వైకుంఠపురములో' మూవీలో బన్నీ చెల్లిగా చేసి పేరు తెచ్చుకుంది.

బేబితో వైష్ణవి సంచలనం:ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన వైష్ణవి చైతన్య.. ఇటీవలే వచ్చిన 'బేబి'తో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఇందులో ఆమె అదిరిపోయే యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆమె బస్తీ అమ్మాయిగా, మోడ్రన్ యువతిగా ప్రేక్షకులను ఫిదా చేసేసింది. ఇక, ఈ చిత్రం 10 రోజుల్లోనే రూ. 60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Baby Heroine Vaishnavi Chaitanya Latest Stinning Photos Viral

ఆఫర్లు ఫుల్... గీతా ఆర్ట్స్‌:ఒకే ఒక్క చిత్రంతో ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న వైష్ణవి చైతన్యకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడు గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు శిరీష్ హీరోగా రూపొందనున్న చిత్రానికి ఎంపికైనట్లు తెలిసింది. అంతేకాదు, బడా సంస్థల నుంచి ఆమెకు ఆఫర్లు వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు వైష్ణవి పేరు మారుమ్రోగిపోతోంది.

అందులో యమ బిజీగా:వైష్ణవి చైతన్య వెలుగులోకి రావడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఇందులో ఈ అమ్మడు ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను అంతకంతకూ పెంచుకుంటూ ముందుకు సాగుతోంది.

Baby Heroine Vaishnavi Chaitanya Latest Stinning Photos Viral

హాట్ షో చేయట్లేదు కానీ:సోషల్ మీడియాలో హీరోయిన్ వైష్ణవి చైతన్య సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూనే ఉంటోంది. చాలా కాలంగా ఇందులో ఉన్నా.. ఈ అమ్మడు మాత్రం పెద్దగా హాట్ షో మాత్రం చేయలేదు. కానీ, ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ డోసు పెంచుకుంటూ వెళ్తోంది. ఇందులో భాగంగానే తన అందాలను చూపిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను తరచూ షేర్ చేసుకుంటోంది.

Baby Heroine Vaishnavi Chaitanya Latest Stinning Photos Viral

వైష్ణవి ఫొటోలు వైరల్‌గా:ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అవుతోన్న వైష్ణవి చైతన్య తాజాగా తన సోషల్ మీడియా ఖాతాల్లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు చీరలో కనిపించింది. అయితే, ఈ ఫొటోలు సైడ్ యాంగిల్ నుంచి తీయడంతో ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్స్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా ఇవన్నీ వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X