49 ఏళ్లు వచ్చిన పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే? బద్రి హీరోయిన్ షాకింగ్ కామెంట్

ఏ సినీ పరిశ్రమలో అయినా కూడా చాలా మంది ప్రముఖ సెలెబ్రెటీలు తమ ప్రేమ వివాహాలు లేదా ఇంట్లో కుదిర్చిన పెళ్లిళ్లే చేసుకుంటారు. కానీ కొందరు మాత్రం ఎందుకో ఎన్నేళ్లయినా కూడా పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయినవారు కూడా చాలా మందే ఉంటారు. అయితే వీరిలో మగ ఆడ అని తేడా లేకుండా దాదాపు చాలా మందే ఎన్నో ఏళ్ల నుంచే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు.

మెయిన్ గా అయితే బాలీవుడ్ సినిమాలో స్టార్ హీరోస్ చాలా మందే ఉన్నారు కానీ హిందీలో ఓ హీరోయిన్ మాత్రం ఎప్పుడు నుంచో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా నిలిచిపోయింది. ఆమె ఎవరో కాదు అమీషా పటేల్ నే.. కాగా అమీషా పటేల్ మన టాలీవుడ్ ఆడియెన్స్ కి ఐతే ఆమె డెబ్యూ సెన్సేషనల్ హిట్ చిత్రం "బద్రి" తోనే బాగా పరిచయం.

Badri Heroine ameesha patel revealed why till now not married

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ లో ఒకరిగా అమీషా పటేల్ పవన్ సరసన నటించింది. కాగా ఈమె నటనకి అభినయానికి మెయిన్ గా పవన్ పక్కన అమాయకపు సరయు గా నటించి మెప్పించింది. ఐతే ఇది మీకు తెలుసా అమీషా పటేల్ ఇంకా పెళ్లి చేసుకోలేదని. ఇప్పుడు ఆమెకి 49 సంవత్సర వయస్సు కానీ ఇంకా ఆమె వివాహం చేసుకోలేదు.

42 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ తన గ్లామ్ షో తో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కి మంచి కిక్ ఇస్తుంది. మరి ఇన్నేళ్ల పాటుగా ఆమె ఎందుకు పెళ్లి చేస్కోలేదో సోషల్ మీడియాలో రివీల్ చేసేసింది. ఓ నెటిజన్ ఎక్స్ ప్లాట్ ఫామ్ లో మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడుగగా దీనికి ఫన్ రిప్లై ని ఆమె అందించింది. హిందీలో "లడ్క హి నహి మిల్ రహా హై.. ఐ యామ్ రెడీ సిన్స్ లాంగ్" అంటూ తెలిపింది.

Badri Heroine ameesha patel revealed why till now not married

అంటే "అబ్బాయి ఇంకా నాకు దొరకలేదు, నేను చాలా కాలం నుంచి సిద్ధం గానే ఉన్నాను" అని ఆమె రిప్లై ఇచ్చింది. అంటే ఆమె మనసుకి నచ్చిన వ్యక్తి ఇన్నేళ్ళలో దొరకలేదా? అనేది ఆశ్చర్యంగా మారింది అని చెప్పాలి. ఇక ఈ ఏజ్ లో మరి ఆమె పెళ్లి చేసుకుంటుందో లేదో అనేది కూడా ప్రశ్నే అని చెప్పాలి. కాగా రీసెంట్ గా అమీషా పటేల్ బాలీవుడ్ లో భారీ హిట్ "గదర్ 2" లో నటించింది.

సన్నీ డియోల్ నటించిన ఈ చిత్రం హిందీలో 550 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకొని రికార్డు సెట్ చేసింది. అలాగే సన్నీ డియోల్ ఇప్పుడు తెలుగులో కూడా గోపీచంద్ మలినేని తో సినిమా చేస్తున్నారు. కాగా అమీషా పటేల్ మన తెలుగులో అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుతో "నాని" అనే సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X