రేయ్ నేనెప్పుడన్నాను.. ఆ వార్తకు నాకు సంబంధం లేదు: బలగం భామ కావ్య కల్యాణ్ రామ్
ప్రస్తుతం అంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఉన్నది లేనట్లు... లేని ఉన్నట్లు.. సృష్టిస్తూ ఉంటారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లపై గాసిప్ వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటూ ఉంటాయి. అలా మొన్న కృతి శెట్టిని ఎవరో టార్చర్ చేస్తున్నారంటూ వార్తలు రాగా.. నేడు బలగం భామను డైరక్టర్ బాడీ షేమింగ్ చేశాడంటూ పొద్దటి నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై కావ్య కల్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే....
మొన్న కృతిశెట్టి: సినిమా ఓ రంగుల ప్రపంచం. అయితే ఈ పరిశ్రమలో హీరో, హీరోయిన్లపై గాసిప్స్ రావడం సహజం. అయితే కొన్ని మీతిమిరి గాసిప్స్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు నటులు స్పందిస్తూ ఉంటారు. మొన్నటి వరకు కృతి శెట్టిని ఓ నిర్మాత కొడుకు టార్చర్ చేస్తున్నాడంటూ వార్తలు గుప్పుమన్నాయి. దీంతో కృతి శెట్టి రంగంలోకి దిగి.. అలాంటిది ఏమి లేదని చెప్పుకొచ్చింది.

బాడీ షేమింగ్: ఇక కావ్య కల్యాణ్ రామ్ గురించి వార్తలు వస్తున్నాయి. బలగం సినిమాతో సక్సెస్ అందుకున్న హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ తను ఎదుర్కొన్న అవమానం గురించి చెప్పిందంటూ వార్తలు వస్తున్నాయి. కల్యాణ్ రామ్ ఆడిషన్స్‌కు హాజరైనప్పుడు దర్శక నిర్మాతలు తనను హేళన చేశారంటూ తెలిపిందని కొన్ని కథనాలు వచ్చాయి. తనను బాడీ షేమింగ్ చేసినట్లు.. కావ్య కల్యాణ్ రామ్ చెప్పిందంటూ మీడియాలో కలకలం రేపింది.
ట్వీట్ వైరల్: ఈ కథనాలు చూసిన కావ్య కల్యాణ్ రామ్.. వీటిపై స్పందించింది. నన్ను దర్శకులు బాడీ షేమ్ చేసినట్లు.. నేను చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి... అవన్నీ అసత్య వార్తలే.. ఇది నేను ఎప్పుడూ చెప్పలేదు. ఇలాంటి తప్పుడు ప్రకటనలు ప్రచారం చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా.. అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చింది ఈ భామ. ఇక ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

అందుకే మాట మార్చిందా: ఇదిలా ఉంటే... ముందు అలా మాట్లాడి.. కావాలనే ప్లేట్ ఫిరాయించిందని కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే.. ఈ భామకు అవకాశాలు రావేమోనని.. మళ్లీ జాగ్రత్తపడి మాట మార్చినట్లు అంటున్నారు. వల్లంకి పిట్ట.. వల్లంకి పిట్ట అంటూ గంగోత్రి సినిమాలో అలరించిన చైల్డ్ ఆర్టిస్ట్ కావ్యా కళ్యాణ్ రామ్.
బాలనటిగా మంచి పేరు తెచ్చుకున్న కావ్య.. మసూద సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. ఆ తర్వాత కావ్య కల్యాణ్ రామ్ కు.. బలగం సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. వేణు ఎల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ భామ.. ఉస్తాద్ అనే సినిమాలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











