డోస్ పెంచిన బలగం బ్యూటీ .. చెట్టెక్కి ఆ పార్ట్ చూపిస్తూ, తట్టుకోవడం కష్టమే

సినీ పరిశ్రమలో అవకాశాలు అంత తేలిగ్గా రావు. ఛాన్స్‌లు దొరికినా ఫేమ్ దొరుకుతుందన్న గ్యారెంటీ లేదు. కానీ మరో రకం ఉంటారు. వీరికి రాత్రికి రాత్రి నేమ్, ఫేమ్ వచ్చేసి స్టార్లు అయిపోతారు. కానీ ఈ స్టార్ డమ్‌ను నిలబెట్టుకోవడమే కష్టం. ఈ కోవలోకే వస్తారు కావ్య కళ్యాణ్ రామ్. బలగం సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో బిజీ అవుతారని అంతా భావించారు. కానీ కావ్య మళ్లీ అడ్రస్ లేరు.

కావ్య కళ్యాణ్ రామ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. స్నేహమంటే ఇదేరా, గంగోత్రి, ఠాగూర్, అడవి రాముడు, బాలు, విజయేంద్ర వర్మ, సుభాష్ చంద్రబోస్, పాండు రంగడు, ఉల్లాసంగా ఉత్సాహంగా తదితర సినిమాలతో కావ్య కళ్యాణ్ రామ్ మంచి పేరు తెచ్చుకుంది. బాలనటిగా చేసినవాళ్లు ప్రస్తుతం ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై హీరోలుగా, హీరోయిన్లుగా నటిస్తుండటంతో కావ్య కూడా వారి బాటలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

balagam fame kavya kalyanram enjoyed vacation in malaysia her latest Photos here

2022లో వచ్చిన మసూద సినిమాతో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్‌గా అవతారమెత్తారు. హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా హిట్‌గా నిలిచినప్పటికీ.. కావ్య పాత్రకు తగిన ప్రాధాన్యం లేకపోవడంతో ఈమె పెద్దగా నోట్ కాలేదు. అయితే జబర్దస్త్ కమెడియన్ వేణు వెల్దండి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన బలగంతో కావ్య కళ్యాణ్‌రామ్ రాత్రికి రాత్రి స్టార్‌గా మారింది. సాంప్రదాయ వస్త్రధారణలో చాలా పద్ధతిగా కనిపించి యువతకు గిలిగింతలు పెట్టింది.

బలగం బ్లాక్‌బస్టర్ కావడంతో కావ్య కళ్యాణ్ రామ్‌కు ఇక తిరుగులేదని రాబోయే రోజుల్లో ఇండస్ట్రీని దున్నేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అందుకు విరుద్ధమైన పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. బలగం తర్వాత తెలుగులో కీరవాణి కొడుకుతో ఉస్తాద్ సినిమా చేసింది కావ్య. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. ఉస్తాద్ తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్‌ను కావ్య అనౌన్స్ చేయకపోవడంతో ఆమె ఏమైపోయిందని అంతా అనుకున్నారు.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే కావ్య కళ్యాణ్ రామ్ ఎప్పటికప్పుడు తన కొత్త సినిమా సంగతులను , వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. బలగంలో పద్ధతిగా కనిపించిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతోంది. ట్రెడిషనల్ వేర్‌ను పక్కనపెట్టి.. వెస్ట్రన్ డ్రెస్‌లో గిలిగింతలు పెడుతోంది. ప్రస్తుతం ఫారిన్ ట్రిప్‌లో ఉన్న కావ్య కళ్యాన్ రామ్ అక్కడి ఫేమస్ ప్లేస్‌లలో ఎంజాయ్ చేస్తోంది. మలేషియాలోని లంగ్‌‌కావీ బీచ్‌లో విహారిస్తున్న ఈ ముద్దుగుమ్మ షార్ట్ గౌన్‌ వేసిన ఫోటోలను షేర్ చేశారు. ఏకంగా చెట్టుపైకెక్కి తోడలు చూపిస్తూ కవ్విస్తున్నారు కావ్య కళ్యాణ్ రామ్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X