బెడ్‌పై అలా పడుకొని వలపు వల.. రొమాంటిక్ ఫోజులతో బలగం బ్యూటీ అరాచకం!
బాలనటిగా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్‌గా మారారు కావ్య కళ్యాణ్‌రామ్. బలగం వంటి బ్లాక్ బస్టర్‌తో ఆమె పేరు మారుమోగిపోయింది. కానీ ఎందుకో ఆ సక్సెస్‌ను కంటిన్యూ చేయకుండా సైలెంట్ అయిపోయింది కావ్య. ఈ అమ్మడు జోరు చూస్తే ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. అయితే ఎందుకో ఆమె బ్రేక్ తీసుకుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే కావ్య కళ్యాణ్ రామ్ తాజాగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
స్నేహమంటే ఇదేరా, గంగోత్రి, ఠాగూర్, అడవి రాముడు, బాలు, విజయేంద్ర వర్మ, సుభాష్ చంద్రబోస్, పాండు రంగడు, ఉల్లాసంగా ఉత్సాహంగా తదితర సినిమాలలో బాలనటిగా మంచి పేరు తెచ్చుకుంది కావ్య కళ్యాణ్ రామ్. అంత చిన్న వయసులోనే ఆమె మోస్ట్ వాంటెడ్ అయ్యింది. దాదాపు 16 సినిమాలలో బాలనటిగా నటించి మెప్పించిన కావ్య తర్వాత చదువుపై ఫోకస్ పెట్టి సినిమాలకు బ్రేక్ చెప్పింది. తర్వాత 2019లో న్యాయవాద పట్టాను పొందింది.
వయసుకొచ్చిన తర్వాత తిరిగి సినిమాల్లో నటించాలని అనుకున్న కావ్య కళ్యాణ్ రామ్ 2022లో వచ్చిన మసూద మూవీతో హీరోయిన్‌గా ఫేస్ టర్నింగ్ ఇచ్చారు. హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచినప్పటికీ.. కావ్య పేరు జనాల్లోకి వెళ్లలేదు. సంగీత, భాందవి శ్రీధర్‌లకే ఈ సినిమా క్రెడిట్ వెళ్లింది. మంచి హిట్ కోసం నిరీక్షిస్తున్న కావ్యకు బలగం ఆ లోటు తీర్చింది.

జబర్దస్త్ ఫేమ్ వేణు డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయం సాధించింది. బలగం తర్వాత తెలుగులో ఆస్కార్ అవార్డ్ విజేత ఎంఎం కీరవాణి కొడుకుతో ఉస్తాద్ సినిమా చేసింది కావ్య. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. ఉస్తాద్ తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్‌ను కావ్య అనౌన్స్ చేయకపోవడంతో ఆమె ఏమైపోయిందని అంతా అనుకున్నారు.
హీరోయిన్‌గా తన ప్రయాణం బాగుందని తాను కథానాయికగా నటించిన ముగ్గురు దర్శకులు తెలుగు అమ్మాయే హీరోయిన్ కావాలనుకోవడం కలిసొచ్చిందని కావ్య ఓ సందర్భంలో అన్నారు. తెలుగు అమ్మాయిలకు తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు రావడం లేదనే విషయంపై డిస్కషన్ నాకు నచ్చదని కావ్య అన్నారు. తాను కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని.. నిర్మాతలే వాటిని అనౌన్స్ చేస్తానని చెప్పారని కావ్య కళ్యాణ్ రామ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ఆ సినిమాలు ఏవి అనేది తెలియరాలేదు.. ఆ తర్వాత కావ్య సినిమాలకు దూరమయ్యారు.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే కావ్య కళ్యాణ్ రామ్ ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు ఇతర వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటోషూట్‌లతో కుర్రకారుకు సెగలు రేపుతుంటారు. తాజాగా కెంపు చీర ధరించి తేనేకళ్లతో చూస్తూ కావ్య కళ్యాణ్ రామ్ చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇంకేందుకు ఆలస్యం కావ్య అందాలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











