ముసలి హీరోల పక్కన చేయను.. అల్లు అర్జున్‌కి నో చెప్పేశా , స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి హీరో కంటే వయసులో 20 నుంచి 30 ఏళ్ల తేడా ఉన్నప్పటికీ వారి రొమాన్స్, కెమెస్ట్రీని ప్రజలు స్వాగతించారు. ఎవరెన్ని అనుకున్నా, ఎన్ని కామెంట్స్ చేసినా ప్రేక్షకులు ఆదరించారంటే ఆ జంటకు తిరుగులేదని అర్ధం. అయితే కొంతమంది ముద్దుగుమ్మలు మాత్రం తాము ముసలి హీరోలతో నటించమంటూ పలుమార్లు ఓపెన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చి కలకలం రేపారు.
రంగుల రాట్నం లాంటి చిత్ర పరిశ్రమలో అవకాశాలు అంత తేలిగ్గా రావు. కష్టపడి అవకాశాలు సంపాదించినా నేమ్ అండ్ ఫేమ్ దొరుకుతుందన్న గ్యారెంటీ ఎవరి చేతుల్లోనూ లేదు. కానీ ఇంకో కేటగిరి ఉంటుంది. వీరికి రాత్రికి రాత్రి నేమ్, ఫేమ్ వచ్చేసి స్టార్లు అయిపోతారు. కానీ ఈ స్టార్ డమ్‌ను నిలబెట్టుకోవడమే కష్టం. ఈ కోవలోకే వస్తారు కావ్య కళ్యాణ్ రామ్. జబర్దస్త్ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అవుతారని అంతా భావించారు. కానీ కావ్య మళ్లీ అడ్రస్ లేరు.

బాలనటిగా కెరీర్ ప్రారంభించిన కావ్య.. స్నేహమంటే ఇదేరా, గంగోత్రి, ఠాగూర్, అడవి రాముడు, బాలు, విజయేంద్ర వర్మ, సుభాష్ చంద్రబోస్, పాండు రంగడు, ఉల్లాసంగా ఉత్సాహంగా తదితర సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. పెరిగి పెద్దయి, వయసుకొచ్చిన తర్వాత 2022లో వచ్చిన మసూద మూవీతో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా హిట్‌గా నిలిచినప్పటికీ.. కావ్య జనాలకు పెద్దగా నోట్ కాలేదు. అయితే బలగంతో కావ్య తెలుగునాట బాగా ఫేమస్ అయ్యారు.
బలగం తర్వాత తెలుగులో కీరవాణి కొడుకుతో ఉస్తాద్ సినిమా చేసింది కావ్య. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. ఉస్తాద్ తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్‌ను కావ్య అనౌన్స్ చేయకపోవడంతో ఆమె ఏమైపోయిందని అంతా అనుకున్నారు. ఈ నేపథ్యంలో కావ్య గతంలో చేసిన వ్యాఖ్యల తాలుకా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముసలి హీరోలతో తాను వర్క్ చేయనంటూ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆమె ఓ ఇంటర్వ్యూలో మండిపడ్డారు.
బాలకృష్ణ, అల్లు అర్జున్ వంటి స్టార్స్‌తో తాను చిన్నప్పుడు నటించానని కావ్య తెలిపారు. ఆ సమయంలో మా పక్కన హీరోయిన్‌గా యాక్ట్ చేస్తావా అని వాళ్లు సరదాగా ముద్దు చేసేవాళ్లని గుర్తుచేసేవారు. నేను హీరోయిన్ అయ్యేసరికి మీరు ముసలివాళ్లు అయిపోతారని చెప్పానని కావ్య కళ్యాణ్ రామ్ వెల్లడించారు. అల్లు అర్జున్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అని ఆయనతో పనిచేయాలని ఎదురు చూస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం కావ్య కళ్యాణ్ రామ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











