For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయి.. ఇంట్లోనే ఉండండంటున్న 'లెజెండ్' బ్యూటీ ?

  |

  తెలుగు సినిమా పరిశ్రమకు ఇప్పటి వరకు బయట నుంచి వచ్చిన హీరోయిన్లలో చాలా మంది హీరోయిన్లు అలా వచ్చి కొన్ని సినిమాల్లో నటించి ఇలా వెళ్లిపోగా, మరికొందరు మాత్రం ఎన్ని అవాంతరాలు వచ్చినా ఇక్కడే ఉండాలని, హిట్టు కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిలో లెజెండ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ ఒకరు.

  సోనాల్ చౌహాన్ తెలుగులో బాలయ్య సరసన 'లెజెండ్', 'డిక్టేటర్' తాజాగా రూలర్ సినిమాలో నటించింది. లెజెండ్ సినిమా సూపర్ హిట్టు, అయినా ఈమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. అందుకే ఎవరి కంటా పడక పోతానా అన్నట్టు, హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజ్‌లిస్తూ.. కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన పిక్ వేసవిలో మరింత హీట్ పెంచేస్తోంది.

  బాలయ్యకి నో చెప్పి..

  బాలయ్యకి నో చెప్పి..

  'జన్నత్' అనే బాలీవుడ్ మూవీతో సిల్వర్ స్ర్కీన్‌ ఎంట్రీ ఇచ్చిన సోనాల్ చౌహాన్. తెలుగులో పండగ చేస్కో, షేర్ లాంటి సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. బాలయ్య సరసన ఎక్కువ సినిమాలు చేసిన ఈ భామకి కాలం మాత్రం కలిసి రావడంలేదు. ఆ మధ్య మళ్ళీ బాలయ్యతో అఖండ అనే సినిమాలో నటించనని తేల్చి చెప్పిన ఈ భామ ప్రస్తుతం సినిమాల కోసం వెయిట్ చేస్తోంది.

  పెళ్లి అక్కడే జరగాలి

  పెళ్లి అక్కడే జరగాలి

  ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి ఎలా జరగాలో, ఎలాంటి వ్యక్తి తన జీవితంలోకి రావాలని కోరుకుంటుందో సోనాల్ చెప్పుకొచ్చింది. తనకు ప్రకృతి అంటే చాలా ఇష్టమని, తన పెళ్లి సాగర తీరం వేదికగా లేదా కొండ ప్రాంతంలో జరగాలని ఆశిస్తున్నానని చెప్పింది. ‘ప్రకృతి అంటే తనకు చాలా ఇష్టమన్న ఆమె ప్రకృతిని మించిన అందం ఇంకోటి లేదని ఆమె చెప్పుకొచ్చింది.

  హాట్ ఫోటోషూట్ లతో రచ్చ

  హాట్ ఫోటోషూట్ లతో రచ్చ

  ఇక బాలీవుడ్ లో అడపాదడపా సినిమాల్లో నటించినా ఈ భామకు సక్సెస్ దక్కడం లేదు. అయితే క్రికెటర్ కెఎల్ రాహుల్ తో డేటింగ్ చేస్తోందన్న పుకార్లతో ఈమెకు పాపులారిటీ పెరిగింది. ఆ తర్వాత ఇన్ స్టా వేదికగా ఫాలోయింగ్ పెంచుకునేందుకు సోనాల్ వరుసగా హాట్ ఫోటోషూట్లు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది..

  ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా

  ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా

  తాజాగా సోనాల్ చౌహన్ షేర్ చేసిన పిక్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఈ ఫోటోను ఆమె తన ఇన్ స్టాలో షేర్ చేసింది. తెల్లటి టాప్ వేసుకున్న సోనాల్ కింద ప్యాంట్ వేసుకోకుండా ఒక్కసారిగా హీట్ పెంచింది. మళ్ళీ దానికి స్టే హోం, స్టే సేఫ్ అనే క్యాప్షన్ ని ఈ ఫోటోకి ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ కరోనా టైమ్‌లో తన అభిమానులకు జాగ్రత్తలు చెబుతూనే.. ఇలా హాట్‌గా దర్శనమిస్తోంది. ఈ పిక్ లో ఆమె తొడల పై దాకా డ్రెస్ ఉండడంతో ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

  Akhanda OTT రిలీజ్ పై చిత్ర బృందం రియాక్షన్ | Nandamuri Balakrishna
  చివరిగా

  చివరిగా

  జన్నత్ లో ఇమ్రాన్ హష్మితో రొమాన్స్ చేసిన సోనాల్ చౌహాన్ హిందీ- తెలుగు- తమిళ భాషలలో నటించింది. చివరిసారిగా మహేష్ మంజ్రేకర్ తెరకెక్కించిన థ్రిల్లర్ మూవీ `ది పవర్` లో చాందిని అనే కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో విద్యుత్ జమ్వాల్ - శృతిహాసన్ లు హీరో హీరోయిన్లుగా నటించారు.

  English summary
  Sonal Chauhan shot to fame in Tollywood by acting in Balakrishna’s films like Legend, Dictator, and Ruler. Now she is unable to get enough offers so she's staying in the headlines with her hot photoshoots. Recently, she shared a pic of her.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X