Aksha Pardasany ప్రేమ పెళ్లి చేసుకున్న బాలయ్య భామ.. పెళ్లి కొడుకు ఎంట్రీ భలే వైరెటీ!
టాలీవుడ్ లో వరుసగా హీరోలు, హీరోయిన్లు పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. ఇక మొన్నటికి మొన్న దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా బాలయ్య బాబు హీరోయిన్ అక్ష పార్ధసాని పెళ్లి పీటలు ఎక్కింది. తను ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసింది. అయితే పెళ్లి కొడుకు బాలీవుడ్ సినిమాటో గ్రాఫర్. ఇక పెళ్లిలో ఆయన ఎంట్రీ మాత్రం హైలెట్ గా నిలిచింది. ఆ పెళ్లి కొడుకు ఏం చేశాడు.. ఎందుకు వైరెటీ అనిపించిందనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.
పెళ్లి పీటలెక్కిన తెలుగు హీరోయిన్: పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. దీంతో వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ప్రేమ పెళ్లి చేసుకుంది. అక్ష పార్ధసాని అనగానే గుర్తు పట్టకపోవచ్చు.. యువత, రైడ్, కందిరీగ, బెంగాల్ టైగర్, శత్రువు, రాధా, డిక్టేటర్.. లాంటి పలు సినిమాల్లో నటించింది అనగానే ఇట్టే గుర్తుపట్టేస్తారు. నిఖిల్, నాని, రామ్ పోతినేని, రవితేజ, శర్వానంద్, బాలయ్య బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించిన ఈ భామ తెలుగు వారికి సుపరిచితమే.

ఫ్యాన్స్ కు ప్రేమపెళ్లితో షాక్: అయితే ఈ హీరోయిన్ తాజాగా ప్రేమ పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. 2017 తర్వాత తెలుగులో ఆఫర్లు తగ్గిపోవడంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కు చెక్కేసింది. నిజానికి ఈ భామది ముంబై. ఇక అక్కడే ఉంటూ అప్పుడప్పుడు పలు వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించింది. తాజాగా హీరోయిన్ అక్ష బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కౌశల్ ని ప్రేమించి పెళ్లాడింది. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల్ని ఒప్పించి.. ఒక్కటయ్యారు.

పెళ్లి కొడుకు ఎంట్రీ వైరల్: ఫిబ్రవరి 26వ తేదీన కౌశల్, అక్ష గోవాలో పెద్దల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇరు కుటుంబాలు, సన్నిహితులు, స్నేహితుల మధ్యే ఈ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పలు పెళ్లి ఫోటోలని అక్ష, కౌశల్ తమ సోషల్ మీడియాల్లో పంచుకోగా.. అభిమానులు అంతా వారికి విషెష్ చెబుతున్నారు. అయితే ఈ పెళ్ళిలో పెళ్లి కొడుకు ఎంట్రీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోను చూసి నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

అసలైన కెమెరామెన్: సాధారణంగా పెళ్లిలో పెళ్లి కొడుకులు గుర్రం లేదా కార్ లేదా రథం వంటి వాటిల్లో కూర్చోపెట్టి ఊరేగింపుగా వస్తుంటారు. అయితే కౌశల్ సినిమాటోగ్రాఫర్ కావడంతో షూటింగ్స్ కి వాడే కెమెరా క్రేన్ మీద కూర్చొని పెళ్లిలోకి ఎంట్రీ ఇవ్వగా.. ఆ వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో ఈ వీడియోను చూసిన నెటిజన్స్... అసలైన కెమెరామెన్ అనిపించుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అక్ష, కౌశల్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ జంటకు పలువురు ప్రముఖులు విషెష్ చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











